అధ్యాపక సిబ్బందిపై చర్యలు

ప్రజావాక్కు
                 అధ్యాపక సిబ్బందిపై చర్యలు

down result ratio
down result ratio

అధ్యాపక సిబ్బందిపై చర్యలు
రాష్ట్రంలో పదవతరగతి విద్యార్థుల అభాసన ఫలితాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. గణితంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నట్లు సదరు ఫలితాలు క్షేత్రస్థాయిలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవ్ఞతోంది. ప్రతీ సబ్జెక్టులో 75 శాతం మార్కులు సాధించిన వారు రెండు శాతం లోపే ఉండటం, వివిధ సబ్జెక్టులలో 35శాతంలోపు మార్కులు సాధించి ఫెయి ల్‌అయిన వారు60శాతం ఉండటం,మన చదువ్ఞల డొల్లతనా న్ని బయటపెడుతోంది. జాతీయసగటుతోపోలిస్తే మన రాష్ట్రం లోగణితం,ఆంగ్లం,సైన్స్‌,హిందీలో వెనుకబడటం బాధాకరం. ఇప్పటికైనా విద్యకోసం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఫలితాల సాధన కోసం పటిష్టమైన ప్రణా ళిక చేపట్టాలి. వృత్తిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పట్టాలు దాటితే జరిమానా
రైలు పట్టాలు దాటితే వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలుశిక్షను దక్షిణమధ్యరైల్వే నిర్ణయించడం ముదా వహం. ఎక్కడ అంటే అక్కడ రైలు పట్టాలు దాటడం నేరంగా నిర్ణయించడం, ఫుట్‌బోర్డు,ఫ్లాట్‌ఫాం అంచులపై నిలబడరా దన్న నిబంధన ముదావహం. అలాగే రైల్వేశాఖ గమనించాల్సి న విషయం కొటి ఉంది. ఎక్స్‌ప్రెస్‌ ప్యాసింజర్‌, సూపర్‌ ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైళ్లని ఎక్కవ సమయం ఫ్లాట్‌ఫారంపై ఆపాలి. జనాలకు సమయం కేటాయించాలి.
-ఆమంచర్ల ఉష, తిరుపతి

విద్యాహక్కు చట్టం అమలులో అలసత్వం
దేశంలో ప్రభుత్వాలు ఆర్భాటంగా విద్యాహక్కు చట్టం 2002సంవత్సరంలోనూ,నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని2008లో తీసుకువచ్చినా ఆచరణలో ఆలసత్వం, నిర్లక్ష్యవైఖరి కారణంగా నేటికీఆరుకోట్ల బాలబాలికలు పాఠ శాల గుమ్మం తొక్కడం లేదన్న జాతీయ బాలల సంక్షేమ మండలి తాజా అధ్యయన నివేదిక క్షేత్రస్థాయిలో పరిస్థి తులకు దర్పణం పడుతోంది. వీరిని బడికి పంపకుండా, పేదరికం,నిరక్షరాస్యత, అవగాహనలేమి తదితర కారణాల వలన ఉపాధి పథకాలకు తరలించడం అనాదిగా జరుగు తున్నా బాలకార్మిక వ్యవస్థను అంతమొందించడంలో గ్రామీణ ప్రాంతాలలో అక్షరాస్యతను పెంచడంలో ప్రభు త్వాలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయి.
– సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

కఠినతర నిబంధనావళి
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వుబ్యాంకు, బ్యాంకులకు కఠినతర నిబంధనావళి విధిం చడంహర్షణీయం. జాతీయ,అంతర్జాతీయ సంక్షోభాలను సమ ర్థంగా ఎదుర్కొనేందుకు దేశీయ బ్యాంకింగ్‌ రంగాన్ని సమా యత్తం చేసేందుకు ఇటువంటి చర్యలు తప్పనిసరి. బ్యాంకుల మూలధన నిష్పత్తి నిబంధనలను కఠినతరం చేయడం, 2019 మార్చికల్లా బ్యాంకులన్నీ 9 శాతం సిఎఆర్‌ను చేరుకోవాలన్న లక్ష్యం నిర్దేశించడం, మొండిబకాయిల వసూలకు తక్షణ చర్య లు చేపట్టడం, పిసిఏ నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణ సామర్థ్యాన్ని పెంచుకోవడం,అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం బ్యాంకులు సగటు మిగులు నిధులను 16 శాతానికి పెంచుకో వడం వంటి చర్యలు బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేసాయి.
-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

బాక్సైట్‌గని తవ్వకం ఆపివేయాలి
రాష్ట్ర ప్రభుత్వం జి.వొ.నెం 97 (ఎన్విరాన్‌మెంట్‌ సైన్సు అండ్‌ టెక్నాలజీ సెక్షన్‌-11)డిపార్లుమెంటు తెదీ5-11-2015 ప్రకారం రాజ్యాంగం విరుద్ధంగా విశాఖపట్నం మన్యంలో 2490 ఎక రాల అటవీ భూమిని చింతపల్లి, జెర్రిల గ్రామాలలో నరిసీపట్ట ణం, ఫారెస్టు డివిజన్‌, విశాఖపట్టణం జిల్లాకు చెందినరిజర్వు ఫారెస్టు భూమిని రాష్ట్రపతి అనుమతి, సంతకం లేకుండా బాక్సైటుగని ప్రైవేట్‌ కంపెనీ అయిన ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కంపెనీకి బిడ్డింగు లేకుండా తవ్వించడానికి పర్యావరణ చట్టం, జల,వాయుకాలుష్య చట్టం, అటవీ పరిశోధన చట్టం, వణ్యప్రాణుల పరిరక్షణచట్టం అనుమతులు తీసుకోకుండా అటవీ భూమిని కేంద్రం అనుమతి లేకుండా తవ్విస్తున్నారు. ప్రభుత్వానికి భూగర్భఖనిజ సంప దలు తీసుకొనే హక్కులు లేదని కోర్టు తీర్పు నిచ్చింది.
-పి. గంగునాయుడు,శ్రీకాకుళం

రోడ్ల మరమ్మతులు చేపట్టండి
తెలంగాణాలో ఎన్నికలొస్తాయి. ఆంధ్రాలో ఎన్నిలొస్తాయి. ఇలా ఎన్నికలొస్తూనే ఉంటాయి. పోతూనేఉంటాయి. కాని కొన్ని సమస్యలు మాత్రం అలాగే పడి ఉన్నాయి. అందు లో నిరుద్యోగ సమస్య ఒకటి. రోడ్లు వేసేసి, మొక్కలు నాటేసి, గోడలకు రంగువేసి, ఇది అభివృద్ధి అంటున్నారు. ఎలక్షన్‌ ముందు రాజకీయ నాయకులకి ప్రజల కష్టాలు గుర్తుకువస్తాయి.ఆ తర్వాత మరిచిపోతారు. గతుకుల రోడ్ల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి.
-ఎస్‌.శ్రీనివాస్‌, హైదరాబాద్‌