అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం మహమ్మద్‌ గెలుపు

ebrahim mahmad
ebrahim mahmad

మాలె: మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యమీన్‌ను ఓడించి ఇబ్రహిం మహమ్మద్‌ సోలిహ్‌ విజయం సాధించారు. అక్కడి ఎన్నికల కమిషన్‌ ఈరోజు ఉదయం ఎన్నికల ఫలితాలను విడుదల చేసింది. ఇబ్రహిం 53.8శాతం ఓట్లను దక్కించుకుని గెలుపొందారని ఈసి ప్రకటించింది. ఇబ్రహిం అనూహ్యరీతిలో విజయం సాధించారు.