అధిష్ఠానం ప‌రిధిలో ఉందిః డికె అరుణ‌

D K Aruna
D K Aruna

హైద‌రాబాద్ః తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్న వార్త‌లు షికారు చేస్తున్న త‌రుణంలో.. కాంగ్రెస్ పార్టీ సీట్లు, పొత్తుల‌పై అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు ఆ పార్టీ నేత డీకే అరుణ‌. కాగా, నేడు హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కాంగ్రెస్ నేత ముఖేష్‌గౌడ్ నివాసంలో నేడు సీనియ‌ర్ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో దామోద‌ర రాజ‌న‌ర్సింహా, డీకే అరుణ్, శ్రీ‌శైలం గౌడ్‌, భిక్ష‌ప‌తి యాద‌వ్‌, రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తాను పార్టీ మారుతున్న‌ట్టు వ‌స్తున్న ఊహాగానాల‌పై దామోద‌ర రాజ‌న‌ర్సింహా వివ‌ర‌ణ ఇచ్చారు. నేను ఎక్క‌డికి పోను.. కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని మీడియాతో చెప్పారు.