అధిష్ఠానం టికెట్లు ఇచ్చినా పోటీచేయమంటున్న నేతలు

CONGRESS
CONGRESS

బెంగళూరు: అధిష్టానం వీరికి టికెట్లు ఇచ్చి నిర్దేశిత నియోజకవర్గంనుంచి పోటీచేయాలనిసూచించినా కర్నాటక ఎన్నికల్లో పోటీచేయబోమని ప్రకటించిననేతలున్నారు. కాంగ్రెస్‌, బిజెపిలనుంచి ఇలా ఇద్దరేసి అభ్యర్ధులు తాము పోటీచేయడంలేనిప్రకటించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ నాయకుడు ఎంహెచ్‌ అంబరీష్‌ మంగళవారం మాండ్యలో టికెట్‌ ఇచ్చిప్పటినీ తాను పోటీచేయలేమని ప్రకటించారు. పార్టీలపరంగా అభ్యర్ధుల తీరుతెన్నులు ఈధోరణులు స్పష్టంచేస్తున్నాయి. పార్టీ వీరినినామినేట్‌చేసినా ఎన్నికల్లో పోటీచేయడంలేదని తిరస్కరిస్తున్నారు. కన్నడ ప్రముఖ నటుడు అంబరీష్‌ కేంద్రమాజీమంత్రిగాసైతం పనిచేసారు. ఆయన వయోభారంముంచుకువస్తున్నందున పోటీచేయడంలేదని చెప్పారు. మాండ్య ప్రజలకు తాను ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటానని, తనకు సంపూర్ణమద్దతునిచ్చారని పేర్కొన్నారు. తన పార్టీకూడా ఎవ్వరికీ ఇప్పటివరకూ బిఫామ్‌ఇవ్వలేదని, పార్టీ తనపట్ల చూపించిన గౌరవానికి ఇదే నిదర్శనమని అన్నారు. మరో కాంగ్రెస్‌నాయకుడు రాష్ట్ర మంత్రి ఎంఆర్‌ సేతారామ్‌కూడా తాను ఎన్నికల్లో పోటీచేయడంలేదని, అందుకు సన్నద్ధంగా లేనని ఆయన ప్రకటించారు. 2008 ఎన్నికల్లో తాను పోటీచేసానని, ఓటమి పాలయినట్లు తెలిపారు. 2013లో కూడా టికెట్‌ ఇచ్చారని,ఆతర్వాత తనను ఎమ్మెల్సీగా ఎన్నికచేసి ఆపై మంత్రిగా నియమించారన్నారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పానని, 15రోజులక్రితమే తన నిర్ణయాన్ని వెల్లడించానన్నారు. అయితే పార్టీ టికెట్‌ ఇచ్చిందని, స్వల్ప వ్యవధి మాత్రమే ఉన్నందున తాను సిద్ధంగాలేనని సీతారామ్‌ వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు దినేష్‌ గూండూరావుమాట్లాడుతూ అంబరీష్‌పరంగా ఆయన సీనియారిటీకి గౌరవం ఇస్తామని, అందువల్లనేఆయనకు టికెట్‌ ఇచ్చామన్నారు. తుదినిర్ణయం కూడా ఆయనకే వదిలివేసామని ఆయన ఒకప్రముఖ నాయకుడు అయినందున ఆయనకు సముచితగౌరవం ఇవ్వాలని పార్టీనిర్ణయించిందన్నారు. ఇక సీతారామ్‌ విషయానికివస్తే ఇటీవలే తాను ఎన్నికల్లో పోటీచేయననిప్రకటించారని, అయితే పార్టీపరంగా ఆయన్ను పోటీచేయించాలని నిర్ణయించామని ఆనియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధికి గట్టిపోటీఇచ్చేది ఆయనేనని అందువల్లనే టికెట్‌ ఇచ్చామని గూండూరావు వెల్లడించారు. ఇదే తరహా రాజకీయం బిజెపిలో కూడా నడుస్తోంది. ఇద్దరు అభ్యర్ధులు పోటీచేసేందుకు తిరస్కరించారు. సీనియర్‌ బిజెపి నాయకుడు వి.సోమన్న కుమారుడు అరున్‌కు హసన్‌జిల్లాలోని ఆర్సికేరే నియోజకవర్గంనుంచి పోటీచేయాలని టికెట్‌ ఇచ్చారు. బికె మంజునాధ్‌ను సిరానుంచి పోటీచేయాలని టికెట్‌ ఇస్తే వారు నిరాకరించారు. పార్టీ ప్రతినిధి ఎస్‌.ప్రకాష్‌మాట్లాడుతూ ఇదొక అనూహ్యపరిణామమమని ఎన్నికల్లో వ్యయం పెరగడం, గెలుస్తానన్న నమ్మకం తగ్గడమే అభ్యర్ధులు వెనుకంజవేయడానికి కారణమని అన్నారు.