అధికారుల‌పై కఠిన చర్యలు

NARASIMHAN
NARASIMHAN

వీఆర్వో పరీక్షలో మంగళసూత్రాలు తీసేయాలన్న అధికార్లపై కఠిన చర్యలు
వాకాబు చేసిన గవర్నర్‌-చర్యలు తీసుకున్నమన్న టిఎస్‌పిఎస్సీ
ఆ పరీక్ష కేంద్రం బ్లాక్‌ లీస్టులో…
హైదరాబాద్‌: వీఆర్వో రాసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థుల పట్ల మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని లిటల్‌ప్లవర్‌ పాఠశాల యాజమాన్యం అనుచిత ప్రవర్తనపై టిఎస్‌పిఎస్సీసీరియస్‌ అయింది. ఆ పరీక్ష కేంద్రాన్ని బ్లాక్‌ లీస్టులో పెట్టాలని నిర్ణయించింది. ఈఘటనపై రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆరా తీశారు. టిఎస్‌పిఎస్సీ అధికార్లను ఈవిషయంపై ప్రశ్నించారు. అయితే తాము మంగళసూత్రాలు తీయాలని ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదని వారు గవర్నర్‌కు తెలిపారు. స్థానిక అధికారుల పొరపాటు వల్ల ఈ తప్పిదం జరిగిందని, దీనిపై విచారణ చేయించామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు గవర్నర్‌కు వివరించారు. అయితే టిఎస్‌పిఎస్సీఆదేశాల మేరకు విచారణ జరిపిన మెదక్‌ జిల్లా కలెక్టర్‌..నలుగురైదుగురు మహిళలే ఇబ్బంది పడ్డారని నివేదిక సమర్పిరచింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్‌ను టిఎస్‌పిఎస్సీ ఆదేశించింది. కాగా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో వీఆర్వో పరీక్ష కోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల మంగళసూత్రం, మెట్టెలు తీయించిన వ్యవహారం వివాదస్పదమైందన్నారు. దీనిపై మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో టిఎస్‌పిఎస్సీస్పందించింది. మంగళసూత్రం తీయించాలని తామేలాంటి ఆదేశాలు జారీ చేయాలేదని టిఎస్‌పిఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.