అధికారులకు మంత్రి లోకేష్‌ ఆదేశం

Lokesh
Lokesh

అమరావతి: మియావాకి పద్ధతిలో రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటే అవకాశం ఉందని మంత్రి లోకేష్‌ అన్నారు. ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019 నాటికి 50లక్షల ఎకరాల్లో మొక్కలు నాటడమే లక్ష్యమని స్పష్టం చేశారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు మండలానికి ఒక నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 10 ఎకరాల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంత పెద్దఎత్తున మొక్కలు నాటే ప్రయత్నం దేశంలో ఎక్కడా చేయడంలేదని, అన్ని శాఖల లక్ష్యంతోనే లక్ష్యాన్ని సాధించగలమని మంత్రి లోకేష్‌ తెలిపారు.