అధికారoలోకి రాగానే ‘హోదాపై తొలిసంతకం

Rahul Gandhi
Rahul Gandhi

అధికారoలోకి రాగానే ‘హోదాపై తొలిసంతకం

గుంటూరు: 2019లోజరిగే ఎన్నికల్లో ఎపిలో అధికారంలోకి వస్తామని, రాగానే తొలిసంతకం ప్రత్యేకహోదా ఫైల్‌పైనే తొలిసంతకం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు.. ఆదివారం సాయంత్రం గుంటూరులోని ముస్లింకళాశాల వద్ద మైదానంలో జరిగన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.. హోదా హక్కు కల్పించేందుకు అన్ని పార్టీలతోకలిసి పోరాడుతామన్నారు.. తాము అధికారంలోకి వస్తే ఎపికి ప్రత్యేక హోదాకు తొలి సంతకం చేస్తామన్నారు..

మోడీ ఉపాధికల్ప, ఉద్యోగాల హామీ ఏమైంది.?

ప్రధాని నరేంద్రమోడీ ఉపాధి కల్పన, ఉద్యోగాల హామీ ఏమైందని రాహుల్‌ విమర్శించారు.. ప్రత్యేక హోదాపైజరిగిన సభలో ఆయన మాట్లాడారు.. మోడీ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు.. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ,లక్షమందికి కూడ ఇవ్వలేదన్నారు..పోలవరంకు జాతీయ హోదా కల్పిస్తామని చట్టంలో చెప్పామన్నారు.

వారు ఎందుకు అడగటం లేదో అర్ధం కావటం లేదు

చంద్రబాబు, జగన్‌ పార్టీలు , ప్రత్యేక హోదాపై ఎందుకు అడగట్టేదోఅర్ధం కావటం లేదని రాహుల్‌ అన్నారు.. నాడు తిరుపతి సభలోప్రధాని మోడీ రాష్ట్రానికి హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.. మోడీ అంటే ఇద్దరు నేతలకు భయమన్నారు.

ప్రత్యేక హోదా ఉంటే కేంద్రం నుంచి 90శాతం నిధులు

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 90శాతం నిధుల ఇస్తుందని రాహుల్‌ అన్నారు. దేవుడి స్థలంలో ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చటం లేదన్నారు. ఇలాంటి వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షణ ఎలా చేస్తారన్నారు.. తిరుపతి వేదికగా ఇచ్చిన హామీని ప్రధాని అమలు చేయలేదన్నారు.

తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ మాటనిలబెట్టుకోవాలి

తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటను ప్రధాని మోడీ నిలబెట్టుకోవాలని రాహుల్‌ అన్నారు.. ప్రత్యేక హోదా గిఫ్ట్‌ కాదని, ఇది రాష్ట్ర ప్రజలహక్కు అన్నారు.. ఎక్కడో ఉన్న అఖిలేష్‌ , వరద్‌యాదవ్‌ వచ్చారు కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకులు మాత్రం రాలేదన్నారు.

ఎపి సమగ్రాభివృద్ధికి హోదా చాలా అవసరం

ఎపి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా చాలా అవసరమని కేంద్రం హోదా ఇవ్వాలని ఆయన అన్నారు.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మన్మోహన్‌ కాదని, ఈ దేశ ప్రధాని అని రాహుల్‌ అన్నారు.