అదే హోరు అదే జోరు…

CHIRU
CHIRU

అదే హోరు అదే జోరు…

గుంటూరు: ఇంతమంది అభిమానులు, ప్రేక్షకులను చూస్తుంటే గతంలోని ‘ఇంద్ర చిత్రంలోని కొన్ని డైలాగులు గుర్తుకొస్తున్నాయని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. తన 150వ చిత్రం ఖైదీనెంబర్‌ 150 ప్రీ రిలీజ్‌ వేడుకను శనివారం సాయంత్రం గుంటూరుకు సమీపంలోని హా§్‌ుల్యాంగ్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈసందర్బం´గా చిరంజీవి మాట్లాడుతూ, ఇంద్ర సినిమాలోని డైలాగులను కొంత మార్పుగా ..ఢిల్లీకి వెళ్లాడు తెరకు దూరమయ్యాడు.. హస్తినకు పోయాడు.. ఆనందానికి దూరమాయ్యడు..అనుకున్నారా.. అదే జోరు, అదే జోరు..అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.. ఈచిత్రం ఇంత మంచిగా రావటానికి దర్శకుడు వివి వినాయక్‌ అని అన్నారు.. అదేవిధంగా తోటి నటులు , సాంకేతిక నిపుణులు తమ విధులను చక్కగా నిర్వహించి సినిమాకు నిండుదనం చేకూర్చారని అన్నారు.

టైటిల్‌ చెప్పింది దాసరే:

తన 150వ చిత్రం ఖైదీనెంబర్‌ 150 అన్న టైటిల్‌ సముచితంగా ఉంటుందని సూచించిన తొలి వ్యక్తి దాసరి నారాయణరావు అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.. ఈచిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో మాట్లాడిన చిరంజీవి అభిమానుల హర్షధ్వానాలు, ప్రోత్సాహం, చప్పట్లు ఇవే తనను రీచార్జి చేశాయని అన్నారు.. తాను సినిమాలకు దూరంగా ఉన్న ఇన్ని సంవత్సరాలూ తనకు క్షణాల్లా గడిచిపోయాయని అన్నారు.. ఆందుకు కారణం మీ అభిమానం అప్యాయతలే అని అన్నారు.

చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ జనసముద్రం

ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ చిరంజీవి సినిమా చూసిన తర్వాత థియేటర్‌ నుంచిబయటకు వచ్చిన ప్రేక్షకులు ఇరగదీశాడు అని అంటారని అన్నారు.. ఖైదీ నంబర్‌ 150 చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడారు.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ నటించటం చరిత్రలో మొదటిసారి అని అన్నారు. కేవలం కృష్టి, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి అని అన్నారు.. 11వతేదీనే సంక్రాంతి వచ్చినట్టు లెక్క ..ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిఇవ్వటానికి వస్తోందన్నారు. చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ జనసముద్రమే అన్నారు.

చిరంజీవి కష్టజీవి

సొంతంగా తన కృష్టి పట్టుదలతో చిరంజీవి మెగాస్టార్‌ అయ్యారని ఆయన నిత్యం కష్టజీవి అని మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఖైదీ చిత్రం నుంచి తమకు ఆయనతో అనుబంధం ఏర్పడిందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

వేలాది మంది అభిమానం ఆయన సొంతం: టి.సుబ్బరామిరెడ్డి
మెగాస్టార్‌ చిరంజీవికి వేలాది మంది అభిమానం సొంత మని టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. చిరంజీవి నటించిన 150 వ చిత్రం విజయవంతం అవుతుందనిఅన్నారు.

ఇండస్ట్రీ బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది: రవిబాబు
ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఈచిత్రం అవుతుందని నటుడు రవిబాబు అన్నారు.. తన కెరీర్‌లోనే తొలిసారిగి చిరంజీవితో కలిసి నటిస్తున్నానని ఆ చిత్రం ఆయన 150వ చిత్రం కావటం తన అదృష్టమని అన్నారు.
సినిమా నిర్మాత, నటుడు రామ్‌చరణ్‌మాట్లాడుతూ,
ఇవాళే సినిమా రిలీజ్‌ అయినట్టుందిఆల్‌రెడీ సూపర్‌హిట్‌ అయిన్నట్టుంది అన్నారు. దర్శకుడు వివి వినాయక్‌ లేకపోతే ఈ సినిమా అయ్యేదికాదు అని అన్నారు.
నటుడు అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ రోజు కోసం వెయిట్‌ చేస్తున్నానని అన్నారు.