అదితితో రొమాంటిక్‌ డ్రామా!

ADITI RAO HYDARI1
ADITI RAO HYDARI

అదితితో రొమాంటిక్‌ డ్రామా!

సాధారణంగా హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుంటుంది. అంటే, ఒక కాంబినేషన్లో వచ్చిన సినిమా విజయాన్ని సాధిస్తే మళ్లీ అదే కాంబినేషన్‌ లో మరో చిత్రం చేస్తుంటారు. అయితే, అందుకు భిన్నంగా తాము చేసిన సినిమా హిట్‌ కాకపోయినా మరో సినిమా చేయడానికి ముందుకు వెళుతోంది ఒక కాంబినేషన్‌. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో అదితిరావు హైదరి కథానాయికగా ఇటీవల చెలియా చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ, వీరి కలయికలో మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రొమాంటిక్‌ డ్రామాగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్లు కోలీవుడ్‌ మీడియా ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళంలో తెరకెక్కించనున్నట్లు సమాచారం.