అదాని సీఈవో అనిల్‌ సార్దాన్‌తో లోకేష్‌ భేటి

 

Nara Lokesh, Anil Sardana, Adani Group, Davos
Nara Lokesh, Anil Sardana, Adani Group, Davos

ఏపి మంత్రి నారా లోకేష్‌ అదాని గ్రూపు సిఈవో అనిల్‌ సార్దానాతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఏపిలో అడాని గ్రూపు తలపెట్టిన డేటా సెంటర్, సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుపై చర్చలు. ప్రతిష్టాత్మకమైన ఈ రెండు ప్రాజెక్టులను త్వరతిగతిన చేపట్టి సిద్ధం చేయాలని లోకేష్‌ కోరారు. విశాఖలో అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవను ప్రస్తావించిన అదాని గ్రూపు సీఈవో. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలు ఎంతో ఆసక్తి చూపి పోటీ పడినా ఏపీలోనే డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్న అద నీ సీఈవో. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు, విధానాలు, నాయకత్వం చొరవ, దార్శనికత చూసి ఏపీని ఎంచుకున్నామని తెలిపిన అదానీ సీఈవో. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోవాలని స్థిరంగా నిర్ణయించుకున్నట్టు మంత్రి లోకేష్‌కు  అదానీ సీఈవో వివరించారు.