అత్యుత్తమ సంతోష నగరం అమరావతి

AP CM Chandra babu Naidu

AP CM Chandra babu Naidu

అత్యుత్తమ సంతోష నగరం అమరావతి

అమరావతి: అమరావతిని ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ సంతోష నగరా ల్లో ఒకటిగా నిలపడమే తన లక్ష్యమని ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పారు. హరిత రాజధాని అమరావతి ఆంధ్రుల అత్యున్నత సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకన్నారు. ప్రజలసంతోష సూచీ లో అమరావతిని అంతర్జాతీయ స్ధాయిలో అగ్ర స్థానంలో నిలబెడతామని తెలిపారు. ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు విజయవాడలో జరగనున్న ‘సం తోష నగరాల సదస్సు 2018 విజయవంతం చే యా లని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సదస్సుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణపై చర్చించేందుకు తన నివాసం నుండి ముఖ్యమంత్రి సిఆర్డీఎ అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సదస్సుకు యుకె, సింగపూర్‌, యుఎఇసహా ప్రపంచంలోని పలు దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతు న్నారని, అమరావతి అభివృద్ధికి దీన్ని చక్కని వేది కగా మలుచుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల రాజధాని అమరావతి విశిష్టతను అంతర్జా తీయ ప్రముఖులకు తెలియజేసేందుకు అవస రమైన అన్నిఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజల సంతోష సూచీనే కీలకాంశంగా అమరావతిని అత్యంత సంతోషకర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సిఎం చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ ఆర్ధిక, సాంకేతిక ఫలా లన్నీ అందాలని, రాజధాని నగరం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సిఎం స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రతి నగ రంలోనూ ప్రజలకు నాణ్యమైన జీవనప్రమాణాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఇందులో భాగంగా పట్టణీకరణ పరిష్కారాలు, నవకల్పనలు, ప్రత్యేకించి కొత్త వర్ధమాన నగరాలకు సంబంధిం చిన అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోందని ముఖ్య మంత్రి చెప్పారు. అమరావతితోపాటు రాష్ట్రంలోని ప్రతి పట్టణం, నగరంలోనూ అంతర్జాతీయంగా అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అందు బాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణీక రణలో అత్యాధునిక అంశాలు, సరికొత్త ఆవిష్క రణలను ప్రదర్శించేందుకు సంతోష నగరాల సద స్సును చక్కని వేదికగా చేసుకోవాలన్నారు. పట్ట ణాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన, అం దుబాటు ధరల్లో ఇళ్లు, సుస్ధిర రవాణా సదు పాయాలు, అందరికీ అందుబాటులో విద్య, నాణ్య మైన జీవన ప్రమాణాల కల్పనవంటి సవాళ్లను అధిగమించేందుకు ఈ సదస్సును గొప్ప అవకా శంగా మలచుకోవాలని సూచించారు.