అత్యధిక పెనాల్టీ గోల్స్‌ నమోదు

Foot Ball
Foot Ball

అత్యధిక పెనాల్టీ గోల్స్‌ నమోదు

మాస్కో: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు అనూహ్య ఫలితాలు తెచ్చి పెడుతున్నాయి. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ టోర్నీలో…లీగ్‌ దశ చివరికి చేరడంతో పలు జట్ల మధ్య మ్యాచ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరో రికార్డు నమోదైంది. అదేంటంటే…ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే అత్యధిక ఫెనాల్టీ గోల్స్‌్‌ నమోదవ్వడం.గతంలో ఏ ప్రపంచకప్‌ టోర్నీ మొత్తంలో నమోదుకానన్ని ఫెనాల్టీ గోల్స్‌ ఈ ఏడాది లీగ్‌ దశ ముగియకముందే నమోదు అయ్యాయి. సోమవారం స్పెయిన్‌-మొరాకో, ఇరాన్‌-పోర్చుగల్‌ మధ్య మ్యాచ్‌లు ముగిసే సమయానికి ఈ ప్రపంచకప్‌లో 20 ఫెనాల్టీ గోల్స్‌ నమోదయ్యాయట.

1990లో ఇటలీలో జరిగిన ప్రపంచకప్‌లో టోర్నీ మొత్తం కలిపి 18 ఫెనాల్టీ గోల్స్‌ నమోదవ్వడమే ఇప్పటివరకు అధికం. ఆ తర్వాత 1998, 2002లో జరిగిన ప్రపంచకప్‌ల్లోనూ 18 మాత్రమే నమోదయ్యాయి. 2014లో టోర్నీ మొత్తం కలిపి 13 ఫెనాల్టీ గోల్స్‌ నమోదయ్యాయి. గతంలో ఏ ప్రపంచకప్‌లో వాడని వార్‌ (వీడియో అసిస్టెంట్‌ రిఫరీ) టెక్నాలజీని ఈ ప్రపంచకప్‌లో వాడటం వల్ల కూడా ఫెనాల్టీ గోల్స్‌ ఎక్కువగా నమోదవుతున్నట్లు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. అయితే మంగళవారం అర్జెంటీనా, నైజీరియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో ఫెనాల్టీ గోల్‌ నమోదు చేసుకునే అవకాశాన్ని అర్జెంటీనా మిస్‌ చేసుకుంది. ఫెనాల్టీ గోల్‌ను స్ట్రయిక్‌ చేసే అవకాశం మెస్సీకి వచ్చింది.

అయితే మ్యాచ్‌ మధ్యలో ఉండగా లభించిన ఫెనాల్టీని మెస్సీ సరిగా వాడలేకపోయాడు. అది కాస్తా గోల్‌ పాయింట్‌ పక్కగుండా పోయింది.