అతి శుభ్రతకు మానసిక చికిత్సే పరిష్కారం

వ్యధ

LADY
LADY

అతి శుభ్రతకు మానసిక చికిత్సే పరిష్కారం

నా వయస్సు 23 సంవత్సరాలు. డిగ్రీ చదివి ఆర్థిక పరిస్థితుల వల్ల కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరాను. ఏడాదిక్రితం ప్రైవేటు ఉద్యోగం చేసే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మా అత్తగారి అతి శుభ్రత, జాగ్రత్తలు, సెంటిమెంట్లకు తట్టుకోలేకపోతున్నాను. నేను రోజంతా డ్యూటీ చేసి ఇంటికి రాగానే అత్తతో కుస్తీ పట్టాల్సి వస్తున్నది. ఇంటి బయట కాళ్లు, చేతులు కడగనిదే ఇంట్లో అడుగుపెట్టనివ్వదు. యూనిఫారంను కూడా హాల్లోనే విప్పేసి, బట్టలు మార్చుకోమంటుంది. విప్పిన యూనిఫారంను కర్రసాయంతో తీసుకెళ్లి బాత్‌రూంలో వేస్తుంది. ఎక్కడెక్కడో తిరిగి వచ్చినందువల్ల యూనిఫారంను చేత్తో ముట్టుకోనంటుంది. నాకు హోదానిచ్చి అన్నం పెట్టే యూనిఫారాన్ని అలా చూడటాన్ని సహించలేక పోతున్నాను. అలాగే సోమ, మంగళ, శుక్రవారాలలో భార్యాభర్తల్ని కలవనివ్వదు. మేమిద్దరం కలిసి నిద్రపోయిన మరుసటిరోజు ఉదయాన్నే పరుపుపై బట్టల్ని కర్రసాయంతో తీసుకెళ్లి బాత్‌రూంలో పడేస్తుంది. గది అంతా శుభ్రం చేసి, పసుపునీళ్లు చల్లుతుంది. బహిష్టు సమయంలో మూడురోజులు వరండాలోనే పడుకోమంటుంది. ఆమె అలా వ్ఞంటే మా ఆడపడచు ఆమెంటే రెట్టింపు శుభ్రత పాటిస్తుంది. బయటికెళ్లి వచ్చిన ప్రతిసారీ స్నానం చేస్తుంది. బంధువేలు ఎవరైనా ఇంటికి వచ్చి సోఫాలపై కూర్చుంటే వారు వెళ్లగానే కవర్లు మార్చి, తడిగుడ్డతో తుడుస్తుంది. ఆమెకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. భర్తతో కాపురం చేయకుండా అలిగి పుట్టింటికి వచ్చేసింది. ఆమె భర్త కాపురానికి రావాలంటూ కోర్టులో కేసు వేసివ్ఞన్నారు. కోర్టు కేసు నుంచి బయట పడటానికి పూజలు, వ్రతాలు అంటూ తిరుగుతుంటుంది. వీరిదరి మధ్య బ్రతకడం నాకు నరకప్రాయంగా వ్ఞంది. ఒక బాధ్యతగల ఉద్యోగంలో వ్ఞన్న నేను వారిని మార్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. నేను హితవ్ఞ చెబితే ‘గొడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు ఉందంటూ రుసరుసలాడుతారు. మా వారికి చెబితే వారినే వెనకేసుకొస్తారు. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోతే అన్నీ తానై పెంచిన అమ్మకు ఎదురు చెప్పలేనంటాడు.
అమ్మ చెప్పినట్టు చేసి మంచి కోడలుగా పేరు తెచ్చుకోమంటాడు. ఈ చాదస్తాల వల్ల నేను సరైన దాంపత్య జీవితాన్ని గడపలేకపోతున్నాను. దీంతో గర్భవతిని అయ్యే అవకాశాలు దొరకడం లేదు. మా అమ్మా నాన్నలు ఏడాదైనా నెల తప్పనందుకు ఆరాలు తీస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్‌ను అయివ్ఞండీ నా హక్కులు, స్వాతంత్య్రాన్ని కాపాడుకోలేకపోతున్నాను. మహిళా పోలీసుల సాయం కోరితే పరువ్ఞ పోతుందని, అత్త, భర్తకు దూరం కావాలసి వస్తుందని సంకోషిస్తున్నాను. ఈ దశలో నాకు సరైన మార్గం చూగలరు.                       – శ్రీదేవి, వరంగల్లు

మీ అత్త, ఆడపడచు అతి శుభ్రత అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీన్నే శాస్త్రీయంగా అబ్బెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓ.సి.డి) అంటారు. భయం, ఆందోళన, సెంటిమెంట్లు, మూఢనమ్మకాలు, వంశానుగత లక్షణాలు ఈ రుగ్మతకు ప్రధాన కారణాలు. మన సమాజంలో ఇలాంటి వారు ఒక శాతం ఉంటారని అంచనా. కొంతమంది ఇతరులకు ఇబ్బంది కలుగని స్థాయిలో బాధపడుతుంటారు. అలాంటి వారిని అందరూ గుర్తించలేరు. ఒ.సి.డి. సమస్య వ్ఞన్నవారు చేసిందే చేయడం, కడిగిందే కడగడం, చెప్పిందే చెప్పడం ద్వారా ఎదుటివారిని విసిగిస్తుంటారు. అలాగే కొంతమంది గంటల తరబడి పూజలు చేస్తుంటారు. కొంతమంది ట్యాంకుల్లో నీళ్లు పూర్తయ్యేవరకు స్నానాల గదిలో ఉంటారు. మరికొంతమంది గంటయినా భోజనం పూర్తి చేయరు. మీ అత్తగారిలా అతి శుభ్రత పాటించేవారు అక్కడక్కడ ఉంటారు. మీ ఆడపడచు తరహావాళ్లు తారసపడుతుంటారు. ఈ రుగ్మతను ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. బాగా ముదిరిపోయిన వారికి దీర్ఘకాలిక చికిత్స తప్పనిసరి. దీనికోసం భర్తను ఒప్పించి ఆపై మీ అత్త ఆడపడుచులతో సంప్రదించండి. వారు మొండిగా మాట్లాడినా విసుగు చెందకుండా వివేకం కల్పించే ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు కలిస్తే అపవిత్రమన్న భావన, సోమ, మంగళ, శుక్రవారాలలో దంపతులు కలవకూడదన్న నియమం అర్థం లేనివని వివరించండి. ఇతరులను ముట్టుకున్నంత మాత్రాన స్నానం చేయడం ఎంత మూర్ఖత్వమో తెలపండి.

మీకు దగ్గరలోని సైకాలజిస్టు లేదా సైకియాట్రిస్టు వద్దకు తీసుకెళ్లండి. అక్కడ వారు అవసరాన్ని బట్టి మానసిక చికిత్స చేస్తారు. సమస్య తీవ్రంగా వ్ఞన్నట్టయితే తప్పకుండా దీర్ఘకాలం మందులు వాడాల్సి వ్ఞంటుంది. ఈ సమస్య నుంచి రెండు మూడు నెలల్లో బయటపడిన వారు ఉన్నారు. కాగా ఏళ్లపాటు మందులు వాడినవారు ఉన్నారు. మానసిక వైద్యుని పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడితే తప్పకుండా రుగ్మత నుండి బయటపడవచ్చు. ఒకవేళ వారు మీ దారికి రాకుంటే మీరే వేరు కాపురం పెట్టడానికి ప్రయత్నించండి. వజ్రాన్ని వజ్రంతో కోయాలి అన్నట్టు సెంటిమెంటును సెంటిమెంటుతో జయించండి. అలిగి వచ్చిన ఆడపడుచు ఇంట్లో వ్ఞంటే సంతానం కలుగదని చెప్పి వేరు కాపురం పెట్టండి. అయితే ముందుగా మీ భర్త మనసు మార్చి మీ దారికి తెచ్చుకోవడం ముఖ్యం. అలాగే కేసుల భయం చూపి మీ దారికి తెచ్చుకునే వీలుందేమో ప్రయత్నించండి. అన్నింటికంటే వారికి మాన సిక చికిత్స చేయించడం ముఖ్యం. సమ యస్ఫూర్తి, ఓర్పు, సహనం తో వారిని మార్చే ప్రయత్నం చేయండి. ఆఖరు అస్త్రంగా మీ హక్కు లు కాపాడుకోవడానికి పోలీసులు, చట్టాలని వినియోగించుకోండి.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌ రెడ్డి, సైకాలజిస్ట్‌