అణగారిన మానవాళికి ‘దళితమే’ శరణ్యం

KANSHIRAM1
KANSHIRAM

అణగారిన మానవాళికి ‘దళితమే’ శరణ్యం

సనాతన హిందూమత వర్ణ వ్యవస్థ అనాదిగా ప్రోత్సహిస్తున్న అస్పృశ్యతపై, అణచివేత, అన్యాయాలపై జీవితాంతం పోరాడిన డా అంబేద్కర్‌, గాంధీజీ వాడిన హరిజన పదాన్ని 1938లో తీవ్రంగా వ్యతిరేకించారు. 1924లో బహిష్కృత హితకారిణి సభ, 1927లో మహద్‌ మహోద్యమం, సైమన్‌ కమిషన్‌కు రాజకీయ హక్కుల సమానత పోరాటం, 1930-32 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో 1936-37 ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ 1920 నుండి 1950 వరకు సర్వసత్తాక స్వతంత్ర సార్వభౌమ, ప్రజాస్వామ్య నవభారత రిపబ్లిక్‌ జాతి నిర్మాతగా డాII అంబేద్కర్‌, 1932 కమ్యూనల్‌ అవార్డు సందర్భంలో గాంధీజీ నిరాహార దీక్షలో ప్రాణాలు పోగొట్టుకొనే పరిస్థితి తప్పించగలగటం విశేషాంశం.

అదంతా ఒక చరిత్ర అయింది. తొ లితరం నవభారత ఆవిర్భావంలో బ్రిటిష్‌ పాలనను పారదోలటానికి నాటి జాతినేతలు సృష్టించిన భావజాలానికి సంబంధించిన ‘వందేమాతరం, ‘హరిజన వంటి పదాలు స్వతంత్ర భారతావనిలో కొన్ని వర్గాలకు చేదు నిజాలుగా దశాబ్దాల కాలభ్రమణంలో అయిష్టం కావటం చారిత్రక వాస్తవం. అఖండ భారతదేశాన్ని మాతృ స్వరూపంగా ఆరాధించి స్వాతంత్య్రోత్తేజానికి స్ఫూర్తి రగిలించిన బంకించంద్ర చటర్జీ గేయం ‘వందేమాతరాన్ని కుదించి ఆలపించవలసి వస్తోంది. ‘జనగణమనపై రాద్ధాంతం తలఎత్తినా, రవీంద్ర కవీంద్రుని చైతన్య భావ మేధస్సు కారణంగా వివాదం సమసిపోయింది. అదేవిధంగా జాతిపిత గాంధీజీ స్వాతంత్య్రోద్యమ కాలంలో సృష్టించిన ‘హరిజన పదం వివాదాగ్రస్తమైంది.

1931 ఆగస్టు 2న గాంధీజీ తన రాజకీయ పరిభాషలో అంత్యజ అనే మాటకు ప్రత్యామ్నాయంగా పుట్టిం చిన హరిజన పదం 60 సంవత్సరాల తరువాత 1991 మార్చి 27న చంద్రశేఖర్‌ ప్రధానిగా వున్న రోజులలో నాటి కేంద్ర కార్మిక సంక్షేమ మంత్రి రామ్జీలాల్‌సుమన్‌ రాష్ట్రాల ముఖ్య మంత్రులకు, ఆ పదాన్ని నిషేధించినట్టు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తెలిపింది.మామూలుగా జన సామాన్యం అర్థం చేసుకొనే తీరుతెన్నులో గాంధీజీ ప్రచారంలోకి తెచ్చిన హరిజ నులు, ఆయన దృష్టిలో దేవుని బిడ్డలయినా ‘హరి అనే మాట హిందూ మత దైవసంబంధితం కావటంతో తీవ్ర అభ్యంతరం సహజంగా ఎదురైంది. మధ్య యుగానికి సంబంధించిన భక్తి తత్త్వ గుజరాతీ కవి నర్సీమెహతా, 18వ శతాబ్దంలో ఒక దేవదాసీ కుమారుని పాత్రకు ఆ పేరు ఉపయోగించటమే కాకుండా అవర్ణ అస్పృశ్య వర్గాల బాధితులకు ఊరట కల్గించే భక్తి భావోత్తేజంతో రాసారు. ప్రాచీన కాలంలోని విష్ణు పురాణ ప్రస్తావన వలన ‘హరి, భగవంతుడైనా, అంటరాని వారితో తాదాత్మ్యం చెంది ఒకటై వారిని తరింపచేసారని కవితాత్మకంగా ఆ పదం ఉపయోగించటం, తదనంతర కాలంలో తీవ్ర వ్యతిరేకతకు సహజంగా కారణమైంది.

19వ శతాబ్ది సామాజిక విప్లవకారుడు జ్యోతిబా ఫూలే వెనుకబడిన అణగారిన, అంట రానివారి అన్యాయ, అసమానతల హిందూమత వర్ణాధిపత్యంపై పోరాడిన రోజులలో శూద్ర, అతిశూద్రులు, దళిత, పత్‌ దళి తులు వంటి పదాలు వెలుగు చూసాయి తరువాత కాలంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, హిందూమత చాతుర్వర్ణ వ్యవస్థను చీల్చి చెండాడిన సోషల్‌ రివల్యూషనరీ డాII బి.ఆర్‌. అంబేద్కర్‌ తన అవిశ్రాంత పోరాటంలో గాంధీజీ మత తాత్త్విక హరిజన సంకుచిత భావాలుగా తీవ్రంగా ప్రతిఘటించి కుల, మత వ్యవస్థపై కొరడా ఝుళిపించారు. సనాతన హిందూమత వర్ణ వ్యవస్థ అనాదిగా ప్రోత్సహిస్తున్న అస్పృశ్యతపై, అణచివేత, అన్యాయాలపై జీవితాంతం పోరాడిన డాII అంబేద్కర్‌, గాంధీజీ వాడిన హరిజన పదాన్ని 1938లో తీవ్రంగా వ్యతిరేకించారు. 1924లో బహిష్కృత హితకారిణి సభ, 1927లో మహద్‌ మహోద్యమం, సైమన్‌ కమిషన్‌కు రాజకీయ హక్కుల సమానత పోరాటం, 1930-32 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో 1936-37 ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ 1920 నుండి 1950 వరకు సర్వసత్తాక స్వతంత్ర సార్వభౌమ, ప్రజాస్వామ్య నవభారత రిపబ్లిక్‌ జాతి నిర్మాతగా డాII అంబేద్కర్‌, 1932 కమ్యూనల్‌ అవార్డు సందర్భంలో గాంధీజీ నిరాహార దీక్షలో ప్రాణాలు పోగొట్టుకొనే పరిస్థితి తప్పించగలగటం విశేషాంశం.

అదంతా ఒక చరిత్ర అయింది. యోగిపుంగవుడు నర్సింహ మెహతా అంటరానివారిని తన సమాన గౌరవ ప్రతిపత్తితో స్వీకరించిన కథనం, గాంధీజీని ఆకట్టుకొని, 1931 నవజీవన్‌ పత్రికలో ప్రప్రథమంగా సబ్‌ టైటిల్‌ ‘హరిజన శీర్షిక పెట్టించింది. బొంబాయి ప్రావిన్స్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో 1938లో కాంగ్రెస్‌ ప్రతిపాదించిన హరిజన పదానికి చట్టబద్ధత, అంబేద్కర్‌ ప్రతిఘటించటంతో ఆగిపోయింది. ముందే ‘అంత్యజ పర్యాయ పదంగా 1934లో గాంధీజీ సారధ్యంలో హరిజనోద్యమం అస్పృశ్యతా నివారణ, అంటరానివారి దేవాలయ ప్రవేశం, హరిజన సేవాసంఘ కార్యక్రమాలు దేశమంతటా విస్తరించాయి. 1935-1955 రెండు దశాబ్దాలలో డాII అంబేద్కర్‌, సామాజిక న్యాయ,

మానవతా వ్యక్తిత్వం, స్వేచ్ఛా స్వాతంత్య్రం లక్ష్య సాధనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసారు. మత మార్పిడుల సామాజిక ప్రక్రియకు ప్రోత్సాహం సర్వత్రా వ్యాపించింది. గాంధీజీ హరిజనోద్యమం పేరిట దేశంలో 12,500 మైళ్లు పర్యటించి, సేవానిధిగా 8 లక్షలుసేకరించారు. 1934 అక్టోబరు వార్థా కాంగ్రెస్‌ సమావేశంలో కాంగ్రెస్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. అస్పృశ్యులు, అంత్యజులు, అణచివేతకు గురైన వారు, అధమ జాతులు, నిమ్నజాతులు, దుఃఖపూరితులు, హరిజనులు అతిశూద్రులు, ఆది ద్రవిడులు ఎందరో మేధావులు ఎన్ని పేర్లు పెట్టినా ‘దళితులు ఆమోదయోగ్యం అయింది. జ్యోతిబా ఫూలే, గాంధీజీ, స్వామి శ్రద్ధానంద, స్వామి వివేకానంద వంటి ప్రముఖులు ఎస్‌.సి., ఎస్‌.టి. వంటి అణగారిన జన సామాన్యపు సామాజిక న్యాయంకోసం సమాన ప్రతిపాదంగా దళిత పదం సూచనప్రాయంగా ఆమోదించారు.

గాంధీజీ, అంటరానితనంపై పోరాటంలో అస్పృశ్య, అంత్యజ, భంగీ, చవూర్‌, మెహతర్‌, పాకీ వంటి అణగారిన పేదల కంటి కన్నీరు తుడిచే ప్రాధాన్యతలో పేరులో ఏముంది? అన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వ కాలంలో, డాII అంబేద్కర్‌ డిప్రెస్‌డ్‌ వర్గాలు అణచివేత, అన్యాయ, అసమానతలపై పోరాట ఫలితంగా షెడ్యూలు కులాలు, తెగలు పర్యాయ పదంగా అధికారయుతంగా అమలు అయింది. అయినా దళిత పదం ప్రాధాన్యతను సామాజిక సంస్కరణవేత్తలు ప్రజా న్యాయపరంగా వినియోగిస్తున్నారు. మహారాష్ట్రలో నామ్‌దేవ్‌ధసాల్‌, జెవి సావర్‌ 1972లో, 1981లో కాన్షీరామ్‌ వంటి నేతలు పటిష్టమైన దళిత ఐక్యతా సంఘర్షణలకు పునాదులు వేసారు. దళిత సాహిత్యం దేశమంతటా వెల్లివిరిసింది. మరాఠీ, ఆంగ్ల నిఘంటువులో 1831 ఈస్టిండియా కంపెనీ పాలనలో జెజె మోల్మ్‌వర్త్‌ దళిత పదాన్ని పేర్కొన్న ఆధారాల నుంచి ఎంతో దూరం ప్రయాణం సాగింది. బుద్ధిజం ప్రసాదించిన ఈ పదం 1990 నాటి బహుజన సమాజ్‌ పార్టీ నేలు ఆత్మగౌరవానికి, అణగారిన వర్గాల పోరాట ఐక్యతారావంగా 200 ఏళ్లనాటి ఉనికి, అస్తిత్వపు విలువలను వెలుగులోకి తెచ్చారు.

1935 ఇండియా చట్టంలో షెడ్యూలు కులాలుగా స్థిరపడింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల మేధావులు, భారతీయ సమాజం దళిత పదాన్ని అంగీకరిస్తోంది. దళితుల సాధికారత, జీవన సంక్షేమానికి మరింత కట్టుబడి వుండవలసిన కేంద్ర ప్రభుత్వం దళిత పదంపై ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయటం అర్థంలేని అవాంఛనీయం. హైకోర్టుల ఉత్తర్వులననుసరించి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, సాంఘిక న్యాయ మంత్రిత్వశాఖ ప్రభుత్వాధికారులకుగానీ లేదా ప్రైవేటు శాటిలైట్‌ ఛానల్స్‌పై, దళిత పద వినియోగంపై ఆంక్షలు విధించటం సమంజస చర్య కాదు, అనవసర రాద్ధాంతం. దళిత మాట లేనిదే భారత జాతి రాజ్యాంగ స్ఫూర్తి సెక్యులరిజం లేదు.

– జయసూర్య,
సీనియర్‌ జర్నలిస్టు