అడకత్తెరలో ఐటిరంగం

                             అడకత్తెరలో ఐటిరంగం

IT SECTOR
IT SECTOR

వరికి కాలం ఎప్పటికీ ఒక్కతీరుగా ఉండదు. ఇంతకాలం యువతకు ఉజ్వల భవిష్యత్‌ అందించి కాసుల వర్షం కురిపించిన ఇంజినీరింగ్‌ విద్య పరిస్థితి నేడు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పటికే ఈ ప్రభావంతో కొన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలుమూతపడ్డాయి. మరికొన్ని అదే దారిలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో కూడా సీట్లు పూర్తిగా భర్తీ కాలేదు. వచ్చేఏడాది పరిస్థితి మరింత దిగ జారవచ్చునని కొన్ని ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందుకు ముఖ్యకార ణం ఇష్టానుసారంగా అవసరానికి మించి రాజకీయ ఒత్తిడులకు లొంగో మరే కారణాలతోనో ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుమతులు ఇచ్చేసారు. వాటిలో నాణ్యతాప్రమా ణాల గూర్చి అంతగా పట్టించుకోలేదు. ఒక దశలో కొన్ని కాలేజీల్లో విద్యార్థులకు అవసరమైన వర్క్‌షాపులు, ల్యాబ్‌లు, లేకుండానే విద్యాబోధనజరిగింది. కొన్ని కాలేజీలు కోళ్ల షెడ్‌లలో నడిపినట్లు కూడా ఆరోపణలువచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలేజీల తనిఖీలు కూడా పెద్దఎత్తునే చేశారు.

ఏదిఏమైనా ఇంజినీరింగ్‌లో చేరి నాలుగేళ్లు చదివితే ఏదోరకంగా విదేశాలకువెళ్లి సంపాదించుకోవ చ్చుననే ఆశలో మధ్యతరగతి కుటుంబాలేకాక దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎందరో పేదలు కూడా తలతాకట్టుపెట్టి తమ పిల్లలను చదివించారు. ఎందరో విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించడమేకాక ఉన్నత చదువ్ఞలు కూడా అభ్యసించి దేశానికి ఇటు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు గత దశాబ్దంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఐటి రంగంలో వచ్చిన మార్పులు అన్నిటికంటే ముఖ్యంగా హెచ్‌-1 వీసాలో అమెరికా అనుసరించబోతున్న విధానాల వల్ల ఆందోళనలు పెరిగిపోతున్నాయి.దాదాపు రెండు లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రస్తుతం చదువ్ఞతున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారునలభైవేల వరకు ఉండవచ్చునని అంచనా. వీరిలో అధికశాతం చదువ్ఞపూర్తి అయిన తర్వాత అక్కడే ఏదో ఒక ఉద్యోగంతో స్థిరపడే ఆలోచనలో ఉన్నారు.

ఇప్పటికీ ఎంతో మంది ఇలానే అమెరికాలో దశాబ్దాల తరబడి ఉండిపోయారు. కానీ ఇప్పు డు పరిస్థితులు మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుండి కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా హెచ్‌-1వీసాలపై ఆరేళ్లు మాత్రమే అమెరికాలో ఉండవ చ్చునని,ఈలోగా గ్రీన్‌కార్డు రాకపోతే స్వదేశానికి వెళ్లిపోవా లనే విధంగా నిబంధనలను సవరించడం ఈ లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇది ఇప్పటికి ప్పుడు ఇబ్బంది పెట్టకపోయినా భవిష్యత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని పలువ్ఞరు నిపుణులే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నిపుణుల కొరతతో ఉన్న అమెరికా ఇలాంటి ప్రతిపాదన వల్ల రెండు దేశాలకు నష్టం జరగవచ్చునని వారు అంటున్నారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని సంప్రదింపులు జరిపి భారతీయులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. ఒకపక్క దేశంలో ఉన్న ఇంజినీ రింగ్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే మరొక పక్క భారత్‌లో ఐటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా జీతాల్లో కోత విధిస్తున్నా రు.

వసతులు తగ్గిస్తున్నారు. ఇప్పుడు తాజాగా హెచ్‌-1 వీసా లపై కొత్తనిబంధనలు తీసుకువస్తే పరిస్థితి మరింత అధ్వా న్నంగా తయారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఒక్క ఇంజి నీరింగ్‌ విద్యార్థులేకాదు.ఉన్నత చదువ్ఞలు అభ్యసించిన వారెందరో నిరాశానిస్పృహలకు లోనవ్ఞతున్నారు. మరీ ము ఖ్యంగా రాష్ట్ర ప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత పరిస్థితి మరింత దారుణంగా తయారవ్ఞతు న్నది. చదివిన చదువ్ఞలకు తగ్గటుగా ఉపాధి దొరక్కపోయి నా జీవించేందుకు అవసరమైన కనీస సంపాదనకు సైతం నోచుకొని దుర్భరపరిస్థితుల్లో కొట్టుకుమిట్లాడు తున్నారు. ఇంజినీరింగ్‌లో బిటెక్‌,ఎంటెక్‌ విద్యార్థులే కాక ఇతర డిగ్రీ పోస్టుగ్రాడ్యుయేట్‌ పూర్తిచేసి గ్రామాల్లో రోజువారీ వ్యవసా యానికి కూలీకి వెళ్లలేక ఒకవేళ పరిస్థితుల ప్రభావంతో కూలికి వెళ్లినా అలవాటులేని కష్టం చేయలేక దేశవ్యాప్తంగా వేలాది మంది యువకులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీకావ్ఞ. పనిచేసే శక్తిఉంది.ఉన్నంతలో కొద్దోగొప్పో మేధా శక్తి ఉంది. కష్టపడి పనిచేయాలన్న ఉత్సాహం ఉంది. సంఘంలోతమకు ఓస్థానం కల్పించుకోవాలనేతపన ఉంది. అయినా ఏ ఆధారం లేక నిరుత్సాహంతో అర్థాకలితో అ సంతృప్తితో అల్లాడిపోతున్నారు.

ఇప్పటివరకు ఇంజినీరింగ్‌, మెడికల్‌ విద్యను అభ్యసించిన మెరికల్లాంటి యువతీయువ కులు విదేశాలకు వెళ్లిపోయేవారు.లక్షలాది రూపాయల ప్రజాధనంతో తాము చదువ్ఞకున్నామన్నది వారి కూడా తె లుసు. ఇక్కడ ప్రజల డబ్బుతో చదివి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సి న యువతరం విదేశాలకు వెళ్లి తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని అక్కడసేవలు అందించడానికి ఆరాటపడ్డారు. అలవాటుపడ్డారు. ఇంతకా లం వీరెందుకు వెళ్తున్నార నేది ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు.వారికి ఉపాధితగిన వసతులతో వేతనం చెల్లించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. పాలకులు ఇప్పటికైనా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారికి ఏదోరకంగా ఉపాధి కల్పించేందుకు త్రికరణశుద్ధిగా ప్రయత్నం జరగాలి. అందులో ఏమాత్రం విఫలమైనా, అటు విదేశాల్లో అవకొశాలు లేక ఇటు స్వదే శంలో ఇబ్బందులుపడలేక ఆ యువత భవిష్యత్‌ ప్రశ్నార్థ కంగా మారుతుంది.దేశప్రగతికి ఇదిఏమాత్రం క్షేమంకాదు.
– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌