అటవీశాఖ అధికారులపై సియం ఫైర్‌

AP CM Chandrabbau Naidu
AP CM Chandrabbau Naidu

అమరావతి: అటవీశాఖలో విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై ఏపి సియం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ పనితీరు బాగోలేదని, సరిగా పనిచేయని అధికారులను సస్పెండ్‌ చేసేందుకు కూడా వెనకాడబోనని చెప్పారు. పచ్చదనం, మొక్కల పెంపకంలో శ్రధ్ధ కనబరచాలని,  రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘వనం-మ‌నం’ కార్యక్రమం అమలులో అలసత్వం చూపించకూడదని, చురుకుగా పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలని చెప్పారు.