అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళులు

 

Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: ఈరోజు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ రాజధానిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద బిజెపి సహా వివిధ పార్టీల ప్రముఖులు వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆహ్వానం పలికారు. వాజ్‌పేయి సమాధిపై ప్రధాని మోదీ పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.