అటల్‌ పెన్షన్‌ యోజనలో సరళీకృత చెల్లింపులు

atal pension yojana
atal pension yojana

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అటల్‌ పెన్షన్‌ యోజన (ఎపివై) పథకం లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై పేమెంట్‌ బ్యాంక్స్‌, స్మాల్‌ ఫైనాన్‌్‌స బ్యాంకుల్లో కూడా ఈ సామాజికపథకం లబ్ధిని పొందొచ్చని తెలిపింది. ఎపివై ఖాతాదారుల సౌకర్యార్థం ఈ వెసులుబాటును కల్పించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎపివై పథకంపై పంపిణీ ఇప్పటికే ఉన్న ఛానెల్స్‌ బలోపేతం చేయడానికి, కొత్తగా చెల్లింపులు బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులను చేర్చినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సామాన్యులకు కూడా పెన్షన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈ సామాజిక భద్రతా పథకం అటల్‌ పెన్షన్‌ యోజన ఫలితం పొందవచ్చని తెలిపింది. దీని ప్రకారం ఆర్‌బిఐ అనుమతి లభించిన పేమెంట్‌ బ్యాంకులు, ఇతర చిన్న ఫైనాన్స్‌ సంస్థల ద్వారా ఈ పథకం లబ్ధిదారులు పెన్షన్‌ పొందవచ్చు. ప్రస్తుతం 11 చెల్లింపు బ్యాంకులు, 10 స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదం లభించినట్లు తెలిపింది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో 2018, జనవరి 15న చిన్న బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులతో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక ఓరియంటేషన్‌ సమావేశంలో ఈ పథకం అమలుపై చర్చించినట్లు వెల్లడించింది.