‘అజ్ఞాతవాసి’ పాటలు ఫిక్స్‌?

PAWAN KALYAN1
PAWAN KALYAN

‘అజ్ఞాతవాసి’ పాటలు ఫిక్స్‌?

పవన్‌ కల్యాణ్‌ , త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సినిమాను జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన ‘బయటికి వచ్చి చూస్తే.. పాటకు మంచి స్పందన లభిస్తోంది.. అనిరుధ్‌ అందించిన ఈసినిమా పాటలన్నీ బాగున్నాయని ఇన్‌సైడ్‌ టాక..
కాగా ప్రస్తుతం ఈచిత్రంయూనిట ఫారిన్‌ లొకేషన్స్‌లో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.. దాదాపు షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈసినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.. కాగా ఈనెల చివరి వారం నుండి పవన్‌ డబ్బింగ్‌ స్టార్ట్‌చేయనున్నారని తెలుస్తోంది.. డిసెంబర్‌ 14న ఆడియోను అభిమానుల సమక్షంలో జరపాలని యూనిట్‌ నిర్ణయించినట్టు సమాచారం..అప్పటి దాకా వెయిట్‌ చేయాల్సిందే మరి.
========