‘అజ్ఞాతవాసి’ ఆడియో డేట్‌ అదే..

pawan
pawan kalyan

పవన్‌కల్యాణ్‌ లేటెస్టు మూవీ ‘అజ్ఞాతవాసి . టైటిల్‌ లోగోతోపాటు ఫస్ట్‌లుక్‌ను కూడ విడుదల చేశారు. జనవరి 10న చిత్రం రిలీజ్‌ అవుతుందని పవన్‌ పుట్టినరోజునే ఇన్ఫర్మేషన్‌ ఇచ్యేయగా, ఇపుడుసినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ పనులు మొదలైపోయినట్టు. కోలీవుడ్‌ సెన్సేషనల్‌ కంపోజర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న అజ్ఞాతవాసి ఆడియోను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయనున్నారు. డిసెంబర్‌ 18, 19 తేదీలను ఫిక్స్‌్‌చేసుకున్నారట. డిసెంబర్‌ 18న ఆదివారం కావటంతో అదే రోజున ఆడియో విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అనుమతిలో ఆలస్యం జరిగితేమాత్రం సేఫ్‌సైడ్‌గా 19న తేదీ అని కూడ అనుకుంటున్నారట. 5 పాటలుంటాయని, వీటిలో ఫుల్‌మాస్‌ బీట్‌తో సాగే సూపర్బ్‌సాంగ్‌ను పవన్‌ స్వయంగా పాడారని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన చిత్రం కావటంతో ఓవర్సీస్‌, శాటిలైట్‌, డిజిటల్‌ ఫార్మాట్స్‌ రూపంలో కూడ భారీ మ్తొతంలో బిజినెస్‌ కావటం ఖాయమంటున్నారు.