అజహర్‌ తర్వాత కోహ్లీనే…

Virat kohli
Virat kohli

అజహర్‌ తర్వాత కోహ్లీనే…

రాజ్‌ కోట్‌: ఇప్పటికే ఎన్నో ఘనతల్ని సాధించిన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ…ప్రత్యర్థి జట్లను ఫాల్‌ఆన్‌ ఆడిం చడంలో కూడా తనమార్కును చూపెడుతున్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలి టెఉ్టలో విండీస్‌ పాలోఆన్‌ ఆడింది. ఫలితంగా అత్యధిక సార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్టును కోహ్లీ ఐదు సార్లు ఫాలో ఆన్‌కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ ఏడు సారుల ఫాలోఆన్‌ ఆడించాడు. దాంతో ఎక్కువసార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత క్రికెట్‌ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే సౌరవ్‌ గంగూలీ-ధోనిలను కోహ్లీ అధిగమించాడు. గంగూలీ-ధోనిలు తమ క్రికెట్‌ కెరీర్‌లో కెప్టెన్లుగా ఉన్న సమయంలో ప్రత్యర్థి జట్టును నాలుగుసార్లు ఫాలోఆన్‌ ఆడిం చారు. ఇప్పటివరకు వీరితో కలిసి కోహ్లీ సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, దాన్ని తాజాగా సవరించాడు.