అజయ్‌కల్లం పై మండిపడ్డ సోమిరెడ్డి

somireddy chandramohan reddy
somireddy chandramohan reddy
నెల్లూరు: మాజీ సీఎస్‌ అజయ్‌కల్లంపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును పొగిడి.. పదవీవిరమణ తర్వాత జగన్ చెంతకు చేరి బాబును విమర్శించడం తగదని హితవుపలికారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో రైతులకు కేసీఆర్‌ ఏం చేశారో… అప్పుల్లో ఉన్న ఏపీలో రైతులకు తాము ఏం చేశామో త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు.