అచ్చెన్నాయుడు పర్యటనలో అపశృతి

acchennayudu copy
acchennayudu

శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. మంత్రికి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలుకుతుండగా హఠాత్తుగా వైసీపీకి చెందిన ఓ స్వాగత ద్వారం కుప్పకూలింది. దీంతో పలువురు కార్యకర్తలు గాయాలు పాలయ్యారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. మంత్రి అచ్చెన్నాయుడికి స్వాగతం పలికేందుకు భారీగా వెళ్తున్న కార్యకర్తలపై జగన్ ప్రజా సంకల్ప యాత్ర కోసం ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నలుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.