అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారు

అచ్చెన్న‌ చేస్తోన్న పోరాటం ప‌ట్ల చంద్రబాబు అభినంద‌లు

అమరావతి: ఏపిలో స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలపై టిడిపి ఏపి అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు పంపగా, శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న‌కు టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, ఆయ‌న చేస్తోన్న పోరాటం ప‌ట్ల అభినంద‌లు తెలిపారు.

ఏపి స‌ర్కారు పాల్ప‌డుతోన్న చ‌ర్య‌ల‌పై పోరాటాన్ని కొన‌సాగిద్దామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ విష‌యంలో పోరాటం చేస్తూ అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని చంద్ర‌బాబు అన్నారు. ఏపీలో బీసీ నేత‌ల‌పై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్న స‌ర్కారుకి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స‌ర్కారు పాల్ప‌డుతోన్న‌ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడుపై క‌క్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.