అచ్చమైన తెలుగు పదాలతో, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా,

CHANDRA BOSE
CHANDRA BOSE

రామ్ చరణ్, సుకుమార్ ల కలయికలో రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రంలోని మొదటి పాట ‘ఎంత సక్కగున్నావే’ ఈ మధ్యే విడుదలై సంగీత ప్రేమికుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్లో రికార్డ్ స్థాయి క్లిక్స్ దక్కించుకున్న ఈ పాట సినిమాపై నమ్మకాన్ని కూడ రెట్టింపు చేసింది.

ఈ పాటలోని సంగీతం ఒక ఎత్తైతే రచయిత చంద్రబోస్ రాసిన సాహిత్యం మరొక ఎత్తు. అచ్చమైన తెలుగు పదాలతో, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, 80ల కాలంనాటి పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా ఉన్న ఈ పాట రచయితగా తనను వేరే స్థాయికి తీసుకెళ్లిందని, ఈ పాటకుగాను తనకు గొప్ప ప్రశంసలు అందాయని, అందుకు దర్శకుడు సుకుమార్, సంగీతం అందించిన దేవిశ్రీలు ప్రధాన కారణమని చంద్రబోస్ అన్నారు.

ఇకపోతే ఈ చిత్రంలోని 2వ పాట కూడ త్వరలోనే రిలీజ్ కానుంది. మార్చి 30న విడుదలకానున్న ఈ చిత్రంతో చరణ్ సాలిడ్ హిట్ అందుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు.