‘అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా

AP CM BABU
AP CM BABU

This slideshow requires JavaScript.

‘అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా

అగ్రిగోల్డ్‌ బాధితులందరినీ ఆదుకుంటా
ప్రైవేట్‌ పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు
బాధితులకు చెక్కులు అందజేసిన సిఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.5కోట్ల విలువ గల చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంపిణీ చేశారు. గురువారం సచివాలయంలో తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒక్కొ క్కరికి రూ.5లక్షలచొప్పున 100మందికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర బాబు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ కేసు పురోగతిపై నిరంతరం సమీక్షిస్తున్నామని, ఐదు రాష్ట్రాల సమస్య కోర్టు పరిధిలో ఉందని, జీఎస్సెల్‌ గ్రూప్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. 19లక్షల కుటుంబాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అగ్రిగోల్డ్‌ బాధితుల న్యాయం కోసం ఎటువంటి నిబంధనలుఉన్నా లెక్కచేయనని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామని, ప్రైవేట్‌ పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని చంద్ర బాబు అన్నారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపించి, రెండేళ్లల్లో రెట్టింపు చేస్తామనే ప్రచారాలకు మోసపొవద్దని సూచించారు. ప్రభుత్వ బ్యాం కుల్లో డిపాజిట్‌ చేసుకోవాలని తెలిపారు.

ఐదు రాష్ట్రాలలో విస్తరించిన కార్యకలాపాలు నిర్వ హించి మోసగించిన నేపధ్యంలో ప్రభుత్వం చొరవచూపి అగ్రిగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారం అందిస్తున్నామని, ఇటువంటి సంస్ధల కార్య కలాపాలపై నిఘూ ఉంచామని చంద్రబాబు తెలి పారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆస్తులు జప్తు చేసి మరీ చెల్లిస్తామని, తప్పుడు పనులు చేసేవారిని ఉపేక్షించనని స్పష్టం చేశారు. పేదలు కోర్టులకు వెళ్లి వ్యయప్రయాసలకు లోనవుతు న్నారని అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా మని, వారికి చెల్లింపుల బాధ్యత తీసుకుంటా మని చంద్రబాబు అన్నారు. మా ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, ఎట్టి పరిస్ధితుల్లో అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు డబ్బులు ఇప్పిస్తామని అన్నారు.

అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ ఫేడరేషన్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి చంద్రబాబును కలుసుకున్న వారిలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగే శ్వరరావు, అధ్యక్షుడు బి. విశ్వనాధరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈవీ నాయుడు, ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖరరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, డీజీపీ మాలకొండయ్య, సీఎం కార్యదర్శి గిరిజాశంకర్‌, ఎడిజిపి ద్వారకా తిరులమరావు, ఐపీఎస్‌ అధికారి, సీఐడీ ఎస్పీ ఉద§్‌ుభాస్కర్‌ బిల్లా, అడిషనల్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌ త్రిమూర్తులు పాల్గొన్నారు.