అగ్రిగోల్డ్‌ ఆస్తులపై చంద్రబాబు టీం కన్ను

 

KANNA LAKSHMI NARAYANA
KANNA LAKSHMI NARAYANA

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై చంద్రబాబు టీం కన్ను

ధర్మపోరాట దీక్షలో కన్నా లక్ష్మీనారాయణ

ఎంవిపికాలనీ (విశాఖపట్నం): 2015 నాటికి ఇరవై ఐదు వేల కోట్లు ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తులు నేడు కేవలం 2200 కోట్లు ఉన్నాయని విలువ కట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు కే చేల్లిందని రాZష బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. శనివారం భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో విశాఖ బిచ్‌ రోడ్‌లో నున్న పార్టీ కార్యలయం వద్ద ప్రభుత్వ అవినీతీ దాహానికి బలైన అగ్రిగోల్డ్‌ బాధితుల తరుపున ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కన్నా లక్షీనారాయణ మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నేడు అదే తల్లి కాంగ్రెస్‌ చంకలోదూరి తెలంగాణలో ఎన్ని కలకు సిద్దపడిందని, తరువాత ఇక్కడ కూడి ఇదే పునారవతం చేసి ప్రజలను మోసం చేయడానికి రడీ అవుతున్నడని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్‌కు చేందిన మూడువేల కోట్ల విలువచేసే హ§్‌ు ల్యాండ్‌ కారుచౌకగ నోక్కేయడానికి పధకం ప్రకారం కేవలం 272 కోట్లకే కోట్టేయాలని చూస్తున్నారని అన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు వేల కోట్లు ఉన్న ఆస్తి విలువ, నేడు కనీసం ఇరవై ఐదు శాతం ఐనా పెరగాలి కానీ, ఇరవై ఐదు వందల శాతం తగ్గడం హాస్యద్పతంగా ఉందని తెలిపారు, రోజు రోజుకి భూములు ధరలు పెరుగుతుంటే, చంద్రబాబు అండ్‌ టీమ్‌ అగ్రిగోల్డు ఆస్తులను సిండికేట్‌ గా ఏర్పడి తక్కువ ధరలకు అమ్మెస్తూరని విరుచుకుపడ్డారు. విజయవాడలో నున్న 40కోట్ల ఆస్తిని కేవలం 11 కోట్లకే కోనుగోలు చేశారని తెలిపారు. 32లక్షల అగ్రిగోల్డ్‌ బాధితులు, 7 లక్షల ఎజెంట్లను దృష్టిలో నుంచుకోవాలని, వారుకనుక ఎదురు తిరిగితే నామరుపం లేకుండాపోతారని హితవు పలికారు. పోలవరా నికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు అందిస్తే, బాబు వారం వారం విహార యాత్రకి వెళ్లి కుటుంబంతో క్యాట్‌ వాక్‌ చేస్తున్నరని అన్నారు. హుదూద్‌ తుఫాన్‌లో పదో వంతు శ్రద్ద తిత్లీ తుఫాన్‌పై పెట్టినా శ్రీకాకుళాలనికి ఆ దుస్తుతి కలిగేది కాదన్నారు.