అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు: మాయవతి

Mayawathi
Mayawathi

లఖనవూ: దళితుల అభ్యున్నతికి తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామంటూ మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుండటంపై బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధకచట్టం కేవలం దళితులకు బుజ్జగించే చర్చ. కేంద్రం దళితులకు చేసిందేమీ లేదని అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో వెనకబడిన వర్గాల వారు విద్యాసంస్థలు,ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని అన్నారు. గత నాలుగేళ్లుగా దళితులు, వెనుకబడిన తరగతుల వారికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ఇటీవల చేపడుతున్న చర్యలు కేవలం దళితులను బుజ్పగించే యత్నాలేనని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో బిజెపి ఒత్తిడికి గురౌతుందన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల చట్టం పునరుద్ధరించడం, ఎన్‌సిబిసికి స్వయంప్రతిపత్తి కల్పించే ప్రయత్నాలు రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆమె అన్నారు.