అగ్నిప్రమాద బాధితులకు మోడి ప్రగాఢ సంతాపం

Karol Bagh hotel fire doused, 9
Karol Bagh hotel fire doused, 9

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం హోటల్‌ ఆర్పిత్‌ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే మంటల కారణంగా వ్యాపించిన పొగ వల్ల ఊపిరాడక చాలా మంది ప్రాణాలు పోయినట్లు సదరు అధికారి తెలిపారు. కగా ఈఘటనపై ప్రధాని మోడి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.