అగ్నిప్రమాదంలో చిన్నారి బాలిక సాహసం

GIRL
GIRL

క్రిస్టల్‌ టవర్స్‌లో నలుగురి మృతి, 22 మంది పొగఘాటుకు సతమతం
ముంబయి: పదేళ్ల చిన్నారి అగ్నిప్రమాదానికి గురికాకుండా 16 మంది జీవితాను కాపాడింది. ముంబయిలోని క్రిస్టల్‌ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ బాలిక చూపించిన తెగువ అందరినీ అబ్బురపరిచింది. ముంబయి పార్లే ప్రాంతంలోని హింద్‌మాతా సినిమాసమీపంలో ఉన్న క్రిస్టల్‌ టవర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలనుంచి అక్కడి వారిని సురక్షితంగా బయటకు చేర్చేబాధ్యత తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. జెన్‌ అనే బాలిక మంటలు చెలరేగిన సమయంలో ఆ భవనంలోనే ఉంది. వారి కుటుంబ సభ్యులు పొగ ఇంటిలోనికి రావడం చూడగానే కిటికీలను తెరిచారు. ఇరుగుపొరుగువారి తలుపులు కొట్టి వారిని కూడా అప్రమత్తంచేసారు. అంతేకాకుండా కాటన్‌తో ఒక ప్యూరిఫయర్‌ను తయారుచేసి నీళ్లు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ప్రతి ఒక్కరిని ఈపొగ ఘాటు తగలకుండా అందరినీ పీల్చి వదిలేయమని చెప్పింది. దీనివల్ల ఆ భవనంలోని వారంతా ఈ పొగధాటికి తట్టుకుని నిలబడగలిగారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి వీరందరినీ రక్షించారు. తన పాఠశాలటీచర్‌ తనకు ఈ విధానం చెప్పిందని, అగ్నిప్రమాదం సమయంలో అందరూ మౌనంగా ఉండి తడి బట్టలను వాడితే పొగఘాటు ఉండదని టీచర్‌ తనకు వివరించిందని, తాను అదే అందరికీ చేశానని వెల్లడించింది. అగ్నిమాపక శాఖకు ఉదయం 8.32గంటలకు సమాచారం అందింది. 17 అంతస్తుల భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు ఫిర్యాదు వచ్చింది. అంతేకాకుండా శరవేగంగా అన్ని ప్రాంతాలకు పొగ వ్యాపించి అందరినీ ఉక్కిరిబిక్కిరిచేసింది. ముంబై ఫైర్‌బ్రిగేడ్‌ చీఫ్‌ పిఎస్‌ రాహంగ్డేల్‌ మాట్లాడుతూ మొత్తం 16 మంది ఒత్తిడికి లోనయ్యారని, వారందరినీ సమీపంలోని కెఇఎం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరు ఆసుపత్రికి వచ్చేసరికే చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సుమారు 100మందికిపైగా నివాసితులను ఈప్రాంతంనుంచి రక్షించారు. ఇదిలా ఉండగా ఈప్రమాదంలో నలుగురు చనిపోయారు. 22 మందికి గాయాలయ్యాయి. హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లను వినియోగించి ఎగువ అంతస్తులకు వెళ్లింది. స్వేఛ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకువీలుగా వారికి అవసరమైన భద్రతాపరికరాలు ముందు అందచేసింది. సుమారు వందమందిని అక్కడినుంచి తరలించింది. నలుగురు అగ్నిమాపక సిబ్బందితోపాటు 22 మంది బాధితులకు ఊపిరాడక సతమతం అయ్యారు. నలుగురు చనిపోయారని వైద్యులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు బాబ్లుషేక్‌, షుభదా షెల్కెలుగా అధికారులు వెల్లడించారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ అన్వేషిస్తున్నారు. అగ్నిప్రమాదాల్లో లిఫ్ట్‌లు వాడకూడదని, అలా వాడితే వారికి ప్రాణహాని ఉంటుందని అధికారులు హెచ్చరిస్తూనే ఉనాన ఇద్దరు లిఫ్ట్‌ వాడి అందులో చిక్కుకుని ఊపిరాడక మరణించారు.మొత్తం 12 అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. నాలుగు వాటర్‌ ట్యాంకర్లతో నీటిని వాటిపై చిమ్మారు. అంతేకాకుండా క్రిస్టల్‌ టవర్‌ నివాసానికి ప్రమాదకరంగా ఉందని ఫైర్‌బ్రిగేడ్‌ ఛీఫ్‌ వెల్లడించారు. అంతేకాకుండా విద్యుత్‌ మంచినీటి కనెక్షన్లు కట్‌చేయాలని, ఇందుకు బాధ్యులైనవారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలని రాహంగ్‌డేల్‌ వెల్లడించారు. ఈ భవనం కమిటీ ఛీఫ్‌ప్రమోటర్‌ జయశ్రీపాటిల్‌ మాట్లాడుతూ బిల్డరు ప్రాపర్టీ పన్ను చెల్లించడంలేదని, భూస్వామినుంచి కొన్నప్పటినుంచి పన్ను చెల్లించలేదని వెల్లడించారు. అంతేకాకుండా అభివృద్ధిచేసే ఒప్పందం ఏదీ జరగలేదని అన్నారు. నివాసితులు బిల్డర్‌ ఆస్తిపన్ను చెల్లించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నా నెరవేరలేదు. ముంబయిమేయర్‌ విశ్వనాధ్‌ మహదేశ్వర్‌ అగ్నిమాపక సిబ్బంది కృషిని ప్రశంసించారు. అలాగే స్థానిక పోలీసులు సైతం తక్షణమే స్పందించారని కొనియాడారు. ఇందుకు సంబంధించి బాధ్యులు ఎవ్వరైనా కఠిన చర్యలుంటాయని, విచారణకు ఆదేశించామని చెప్పారు.