అగ్నిప్రమాదంపై పవన్ ప్రగాఢ సానుభూతి

హైదరాబాద్: వరంగల్ జిల్లా కోటిలింగాలలో జరిగిన అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 11 మంది కార్మికులు మృత్యువాత పడటం చాలా బాధ కల్గించిందన్నారు. మృతల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనల జరగకుండా నిబంధనలు కఠినతరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పవన్ తెలిపారు.