అఖిలప్రియ సంతకం ఫోర్జరీ

AP Minister Akhila Priya
AP Minister Akhila Priya

అమరావతి: ఏపి రాజధాని అమరావతి సచివాలయంలో బుధవారం నకిలీ సంతకం కలకలం రేపింది. అలీ అనే వ్యక్తి రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. వారం రోజుల్లోగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ పేరుతో ఓ లేఖను సిధ్ధం చేశాడు. అందరి దగ్గరకు తిరిగి విసిగి వేసారిపోయి, తానే సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సంతకం ఉన్న లేఖను నేరుగా అఖిలప్రియ వద్దకు తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఎస్పీఎస్‌ సిబ్బందికి అఖిల ఫిర్యాదు చేశారు. దీంతో అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.