అక్షయ తృతీయపైనే జ్యుయెలర్ల దృష్టి

Jewellery1
Jewellery1

అక్షయ తృతీయపైనే జ్యుయెలర్ల దృష్టి

ముంబయి: పసిడికొనుగోళ్లకు అత్యంత పవిత్రంగాభావించే అక్షయతృతీయ వచ్చేవారం రానుం డటంతో కొనుగోళ్ల పెరుగుదలపైనే సంస్థలు ఆసక్తిచూపిస్తుంటే కస్టమర్లు, కొనుగోలు దారుల్లో మాత్రం ధరల్లో మార్పులపైనే ఎక్కువ ఆసక్తిచూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సైతం బంగారంధరలు పెరుగుతున్నాయి. గత వారం ఐదునెలల గరిష్టస్థాయిని తాకాయి. 2017లో ఇప్పటివరకూ పసిడి 13-14శాతం పెరిగింది. దేశీయ మార్కెట్లలో సైతం ఇదే తీరు కొనసాగింది. పదిగ్రాముల బంగారం 29,425 రూపాయలుగా కొనసాగింది. గడచిన కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు పెరుగుతున్నాయి. పసిడి మార్కెట్‌పై కొంత మందగమనం దిగువస్థాయిలో ఒత్తిడి కూడాపెరిగింది. గడచిన ఆరునెలల్లో దిగువ స్థాయిలోనే ఎంపికచేసిన స్థాయిలో కొనుగోళ్లు జరిగా యి. ఇక ముడిచమురుధరలు కూడాపెరిగాయి. భౌగో ళిక ఉద్రిక్తతలుకూడా పెరిగాయి. దీనివల్లనే పసిడి రంగంలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశం కలిగిస్తున్నట్లు జియోజిత్‌ ఆర్థికసేవల సంస్థ చీఫ్‌మార్కెట్‌ వ్యూహకర్త ఆనంద్‌జేమ్స్‌ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఔన్స్‌ బంగారం 1152.15 డాలర్ల నుంచి 1285.25 డాలర్లకు పెరిగింది. 11.55శాతం మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయ మార్కెట్‌లో సైతం భారతీయ కరెన్సీ రూపాయి 5.5శాతం పెరిగింది. ఇంచుమించు ఆరుశాతానికి పైగా పెరిగినట్లు నిపుణుల అంచనా. ఈ దశలో కొంతమేర రానున్న అక్షయ తృతీయకు బంగారం మార్కెట్‌ రూ.30వేలకుపైబడి నడిచే అవకాశంలేకపోలేదని బులియన్‌ నిపుణులుఅంచనా వేస్తున్నారు.