అక్ర‌మ సంబంధం ఆరోప‌ణ‌ల‌తో ఆనాగ‌రిక చ‌ర్య‌

Suicide
Suicide

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పంచాయితీ పెద్దల తీర్పుతో బలవంతంగా అతనితో మూత్రం తాగించగా.. ఆ అవమాన భారంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  వివరాల్లోకి వెళ్తే… సహారాన్‌పూర్‌లోని ఇందిరా కాలనీకి చెందిన యువకుడికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా.. పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. మహిళలు అతనితో బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటన తర్వాత ఇంటికెళ్లిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి కాపాడారు. అసలు ఆ యువతి ఎవరో తనకు తెలీదని.. ఎంత చెబుతున్నా వినకుండా గ్రామస్థులు తనపై దాడి చేశారని అతను చెబుతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అతను పోలీస్‌ రక్షణ కోరుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.