అక్ర‌మ క‌ట్ట‌డాలను వెంట‌నే కూల్చేయండిః మేయ‌ర్

Bontu Rammohan
hyd mayor Bontu Rammohan

హైదరాబాద్‌: నాలాలపై ఆక్రమనల కూల్చివేతపై టౌన్‌ప్లానింగ్‌, ప్రాజెక్ట్‌ విభాగం ఇంజినీర్లు, డిప్యూటీ కమిషనర్లతో గురువారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా నాలాలపై తీవ్ర అడ్డంకిగా ఉన్న 844 అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక, న్యాయ పరమైన అడ్డంకులు లేని నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని, అక్రమ నిర్మాణం చేపట్టిన ప్రతి ఒక్కరికీ విధిగా తాఖీదులు ముందుగానే అందజేయాలని స్పష్టం చేశారు. నాలాల విస్తరణ సందర్భంగా ఇళ్లు కోల్పోతున్న నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు కేటాయించేందుకు నగరంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే పథకాలకు చెందిన రెండు వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అక్టోబర్‌ 28 నుంచి కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా ఇప్పటివరకు 93 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు చెప్పారు. నాలాల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తి కాగానే ఇంజినీరింగ్‌ అధికారులు నిర్మాణ వ్యర్థాలను తొలగించి నాలా విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని వారు ఆదేశించారు.