అక్రమంగా యూరోపియన్‌ దేశాలకు గోమాంసం

Poland exported 5,500 pounds of mea
Poland exported 5,500 pounds of mea

వార్సా: అనారోగ్యంతో ఉన్న గోవులను అక్రమంగా చంపి పోలండ్‌ దేశంలో మాంసం కోసం భారీ సంఖ్యలో 5500 పౌండ్ల(2500కిలోలు) మాంసాన్ని యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి చేశారని పోలండ్‌ పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈయూ దేశాలైన పిన్‌లాండ్, హంగేరి, ఈస్టోనియా, రొమేనియా, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, లూథియానా, పోర్చుగల్, స్లొవేకియా దేశాలకు గోమాంసాన్ని అక్రమంగా అక్రమంగా మాంసాన్ని తరలిస్తున్నారు. తక్కువ మొత్తంలో ఉన్న మాంసాన్ని స్వీడన్‌లోని నాలుగు కంపెనీలకు అక్రమంగా అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టంకు వ్యతిరేకమైనదని, ఇది అంగీకారయోగ్యమైనది కాదని స్వీడన్ జాతీయ ఆహార సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. అక్రమంగా గోమాంసం ఎగుమతి అవుతున్న ఈయూ దేశాలను అప్రమత్తం చేశామన్నారు.