అక్రమంగా భారత్ లో ఉంటున్న నైజీరియన్ పై కేసు

visa, passport
visa, passport

న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా భారత్ లో ఉంటున్న నైజీరియన్ ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై వెళ్లేందుకు వచ్చిన నైజీరియన్ ఎమ్మాన్యుయేల్ సీ అజునుమాను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు తనిఖీ చేశారు. ఎమ్మాన్యుయేల్ పాస్ పోర్టు, వీసా చూడగా..అతడు 3 నెలల మెడికల్ వీసాపై 2010లో భారత్ కు వచ్చినట్లు ఉంది. 3 నెలలు గడువు ముగిసిన తర్వాత వీసా పునరుద్దరణ చేసుకోకుండా తిరిగెళ్లలేదని సీఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ఎమ్మాన్యుయేల్ ను ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్వో) అధికారులకు అప్పగించారు. చట్టవిరుద్ధంగా ఎనిమిదేళ్లుగా భారత్ లో ఉంటున్న ఎమ్మాన్యుయేల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.