అక్టోబ‌ర్ 3న రాష్ర్ట‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లుః ఉత్త‌మ్‌

Uttam Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. సోమవారం రైతు సంఘాలతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన ఉత్తమ్ భూ వివాదాల్లో రైతు సమన్వయ సమితుల జోక్యాన్ని అంగీకరించబోమన్నారు. రైతు సమితుల జోక్యం వల్ల స్థానిక సంస్థల అదికారాలు హరించబడతాయని, దీనికి నిరసనగా అక్టోబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా రైతు పెట్టుబడి పథకంలో భాగంగా కౌలు రైతులకు కూడా రూ. 4 వేలు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్  చేశారు.