అక్టోబ‌ర్ 1నుంచి నూతన మ‌ద్యం పాల‌సీ

wines
wines

హైద‌రాబాద్ః అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాల‌సీ అమల్లోకి రానుంది. దీంతో కొత్తగా ఏర్పాటు కానున్న 2,146  మద్యం షాపులలో రహదారులపై ఉన్న మద్యం షాపులన్నీ కచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంది. మరోవైపు నూతన  మద్యం పాలసీలో భాగంగా అదనంగా మరో రెండు గంటల పాటు వ్యాపారం చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.  ఇప్పటి వరకు వైన్ షాపులు ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 10 వరకు ఉంటున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఈ షాపులు  ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగనున్నాయి.