అక్టోబర్‌ 27న ‘ఆక్సిజన్‌’ రిలీజ్‌

A Still From OXYGEN
A Still From OXYGEN

అక్టోబర్‌ 27న ‘ఆక్సిజన్‌’ రిలీజ్‌

మ్యాచో హీరో గోపీచంద్‌ హీరోగా ఎఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆక్సిజన్‌.. గోపీచంద్‌ సరసన రాశీఖనా, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటించిన ఈచిత్రానిన శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.. ఈసినిమా నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.. అక్టోబర్‌ 27న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఈసందర్భంగా చిత్ర నిర్మాత ఐశ్వర్య మాట్లాడారు.. హై టెక్నికల్‌ వాల్యూస్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈచిత్రం గోపీచంద్‌ కెరీర్‌లోనే స్పెషల్‌మూవీ అవుతుందన్నారు. గోపీచంద్‌గారి డెడికేషన్‌, సపోర్ట్‌తో సినిమాను చక్కగా పూర్తిచేయగలిగామన్నారు. ఫస్ట్‌కాపీ సిద్ధమైందని అన్నారు. సినిమాను అక్టోబర్‌ 27న విడుదల చేస్తున్నామన్నారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై ప్రాంతాల్లోమేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజన్‌ చిత్రాన్ని రూపొదించామన్నారు. జగపతిబాబుగారు సినిమాలో కీలకపాత్ర పోషించారన్నారు. ఆయన నటన సినిమాకు పెద్దప్లస్‌ అవుతుందన్నారు. సిజీ వర్క్స్‌ అద్భుతంగా చేశామన్నారు.. యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను అక్టోబర్‌ మొదటివారంలో విడుదల చేసి, సినిమాను అక్టోబర్‌ 27న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.