అక్కడ మోడి, ఇక్కడ కెసిఆర్‌ ఇద్ద‌రూ ఇద్ద‌రే

RAHUL GANDHI
RAHUL GANDHI

దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైంది
ఎక్కడ చూసిన హత్యచారాలు, దాడులతో ప్రజలు వణికిపోతున్నారు.
కాంగ్రేస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు పూర్వవైభం వెస్తాము
మహిళల హర్షధ్వనాల మధ్య కొన సాగిన రాహుల్‌గాంధీ ప్రసంగం
రంగారెడ్డిజిల్లాప్రతినిధిహైదరాబాద్‌ఆగస్టు13(ప్రభాతవార్త) ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికెసిఆర్‌, అక్కడ ప్రధానమంత్రి మోడి ఇద్దరు కూడా ప్రజావ్యతిరేఖవిధానాలు అవలంభిస్తున్నారని. వీరి విదానాల వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ద్వజమెత్తారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని క్లాసికల్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల రాష్ట్ర సదస్సులో సొమవారం సాయంత్రం ముఖ్యఅతిదిగా పాల్గోని ప్రసంగించారు భారీగా తరలివచ్చిన మహిళలతో ఆయన ఇష్టాగొష్టిగా మాట్లాడారు. మోడి, కెసిఆర్‌ మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని,మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు నామ మాత్రమేనని,మహిళలకోసం అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నమని చెప్పడమే కాని ఎక్కడ కూడా మహిళలకోసం పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిందంటు ఏమి లేదన్నారు. వాగ్దానాలు చేయడంలో, ప్రజలను మోసం చేయడంలో మోడి కెసిఆర్‌లు దిట్టగా రాహుల్‌గాంధీ అభివర్ణించారు. దేశంలో కాంగ్రేస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే మహిళల అభివృద్ది కోసం ప్రత్యేకంగానిధులు కేటాయించి అభివృద్దిలో ముందుకు నడిపిస్తామన్నారు. దేశానికే తెలంగాణ, ఆంద్ర మహిళలు ముఖ్యంగా ఎస్‌హెచ్‌జి, మహిళలు ఉత్తర్‌ప్రదేశ్‌ రా§్‌ుబళేరి ప్రాంతంలోని మహిళలకు స్వయం సహాయక సంఘాల రూపకల్పనలో శిక్షణ ఇచ్చారని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న గుర్తింపు డ్వాక్రా మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అస్తమానం అబద్దాలు మాట్లాడడంలో వీరిద్దరని మించిన వారు మరొక్కరు లేరన్నారు.కేంద్రంలో మోడి సర్కార్‌ గ్రామీణ పేద ప్రజల కడుపుకొడుతూ పారిశ్రామిక వేతల కడుపునింపుతుందన్నారు.కేంద్రంలోని మోడి పాలనలో మహిళలకు,చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.గత కొన్ని సంవతవ్సరాలుగా దేశ వ్యాప్తంగా హత్యచారాలు,మానభంగాలు,దళితులపై దాడులు మరింత అధికమవుతున్నా ప్రధాన మంత్రి మోడి మాత్రం పల్లెత్తి కూడా ప్రశ్నించకపోవడం పట్ల రాహుల్‌గాంధీ ఆందోళనవ్యక్తంచేశారు.ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంతోపాటు అనేక ప్రాంతాల్లో బిజెపి ఎమ్మేల్యేలు హత్యచారాలకు పాల్పడి దాడులు చేస్తున్న సంఘటనలను రాహుల్‌గాంధీ సభలో మహిళల దృష్టికి తీసుకవచ్చారు.ఎన్‌డిఎ హాయంలో జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి కాంగ్రేస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉందన్నారు. ఎక్కడ దాడులు జరిగిన కాంగ్రేస్‌ పార్టీ పేద ప్రజల పక్షాణ నిలుస్తుందని రాహుల్‌గాంధీ మహిళలకు బరోస ఇచ్చారు. రైతులకోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడి చేసిన హామీలన్ని బుట్టదాఖలాలు అయాయన్నారు.ఎన్నికల సమయంలో 2 వేలకోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామాని చెప్పిన ప్రధాన మంత్రి మాటఎమైందన్నారు.దేశ వ్యాప్తంగా రైతులకు రుణ మాఫి చేస్తున్నామని గొప్పలు చెపుతున్ప మోడి, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వం 36 వేల కోట్ల వరకు రైతులకు రుణమాపి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాళాదన్‌, నోట్ల రద్దు వంటి కార్యక్రమాల వల్ల పేద ప్రజలకు పెద్దగా ఒరిగిందంటు ఎమిలేదన్నారు. నోట్ల రద్దు సమయంలో పేద ప్రజలు భ్యాంక్‌ల ముందు క్యూలో ఉంటే, పారిశ్రామిక వేత్తలు బాడా వ్యాపారులు బ్యాంక్‌ల వెనుక నుంచి తమ పనులు పూర్తిచేసుకున్నారని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు వల్ల పేద ప్రజలంతా తమకు లాభ చేకూరుతుందని నమ్మించి మీఖాతలో డబ్బులు జమవుతాయని రకరాకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మోడి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.రాష్ట్రంలో కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పేద ప్రజల భూములు లాకోవడం,అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ ఇద్దరు నాయకులకు తగిన బుద్దిచెప్పడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు సిద్దంగా ఉండాలని రాహుల్‌గాంధీ పిలుపు నిచ్చారు. జిఎస్‌టి వల్ల పేద ప్రజలను మరిన్ని ఆర్థిక ఇక్కట్ల పాలుచేస్తున్నారన్నారు. జిఎస్‌టిని గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌గా అభిప్రాయపడ్డారు. ఈ ట్యాక్స్‌ ద్వారా పేద ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు.దేశంలో కాంగ్రేస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలకు అమోద యోగ్యమైన ట్యాక్స్‌ అందుబాటులోకి తెస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రేస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జినాయకుడు కుంతియా, మాజీ కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర కాంగ్రేస్‌ పార్టీ బట్టి విక్రమార్క, సర్వేసత్యనారాయణ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య,పి సబితాఇంద్రారెడ్డి, దాసాజ్‌ బోసరాజు,షబీర్‌అల్లీ,డికె అరుణ,గీతారెడ్డి,శ్రీదర్‌బాబు,మల్లు రవి,రేవంత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, చెవులపల్లి ప్రతాప్‌రెడ్డి, కోంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, దామోదరం రాజనర్శింహ్మ, ప్రసాద్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ఎమ్మేల్యేలు సంపత్‌కుమార్‌, వంశీచందర్‌రెడ్డి, సుదాకర్‌రెడ్డి,క్యామమల్లేశ్‌, ఆర్‌ సిద్దేశ్వర్‌, పహిమ్‌ తదితరులు పాల్గోన్నారు.