అక్కడ ఉపాధ్యాయులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యా సంస్థల ఉపాధ్యాయులు పాటించేలా డ్రెస్‌ కోడ్‌ డిక్రీని జారీ చేసింది. ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌డీఈ) కింద అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ముఖ్యంగా మహిళలు జీన్స్, టీ షర్టులు, టైట్స్ ధరించరాదని పేర్కొన్నది. ఇటీవల బహవల్‌పూర్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు ఇలాంటి దుస్తులు ధరించకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్పడటంతో అక్కడ కొత్త కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నాయి. వీరి ప్రభావం పక్కనే ఉన్న పాకిస్తాన్‌పై కూడా పడింది. వారి మాదిరిగానే మహిళలు ధరించే డ్రెస్‌లపై కన్నుపడింది. ఉన్నపళంగా కొత్త డ్రెస్‌ కోడ్‌ను ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాలిబాన్‌తో అంటకాగి వారి విధానాలను ఇక్కడ కూడా అమలుపర్చాలని చూడటం మూర్ఖత్వమే అవుతుందని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/