అకాల వర్షాలకు పంట నష్టం 228 కోట్లు

Farmer
Farmer

అకాల వర్షాలకు పంట నష్టం 228 కోట్లు

హైదరాబాద్‌, ం రాష్ట్రంలో ఇటీవల కురుసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు 228.20 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు వ్యవ సాయ శాఖ అధికారవర్గాలు లెక్క కట్టారు. ఇందులో వ్యవసాయం, పండ్ల తోటలు అధి కంగా ఉన్నాయి. వీటి నష్టం విలు 227.15 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ నివే దికను వ్యవసాయ శాఖ అధికారులు సిఎం కార్యాలయానికి పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నివేదికను పరిశీలించిన అనం తరం దాన్ని కేంద్రానికి పంపనున్నారు. తదు పరి పంటలను నష్టపోయిన రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీని ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారర్గాలు వెల్లడిస్తున్నా యి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు వడగండ్లు, వర్షాలు కురియడంతో 26,200 మంది రైతులకు చెందిన వ్యవసాయ, ఉద్యా న పంటలు కలిపి 1.15 లక్షల ఎకరాల్లో పం టనష్టం వాటిల్లినట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారవర్గాలు లెక్కకట్టాయి. రాష్ట్రం లోని 16 జిల్లాల్లో అత్యధికంగా వరి, మొక్క జొన్న పంటలు దెబ్బతిన్నాయి.