అకాడమీలో మౌలిక సదుపాయాల లేమికి అనుమతి…? : మంత్రి సోమిరెడ్డి

Somireddy
Somireddy Chandramohan reddy

తిరుపతిలో ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అగ్రికల్చర్‌ అకాడమీలో కనీస సౌకర్యాల లేమిపై ఏపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి
మండిపడ్డారు. తిరుపతిలో ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అగ్రికల్చర్‌ అకాడమీని పరిశీలించారు.
పొలాలు, ప్రయోగశాలలు లేకుండా అకాడమీ ఎలా నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహాం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే ఈ అకాడమీని
సీజ్‌ చేయాలని పోలీసులకు ఆదేశించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కళశాలలపై చర్యలకు మంత్రి ఆదేశించారు.