అకస్మాత్తుగా గుండెపోటు

Jayalalitha
Jayalalitha

అకస్మాత్తుగా గుండెపోటు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్టు ఆపోలో వైద్యులు పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె ఆరోగ్యం బాగుందని త్వరలోనే డిశ్చార్జి కావచ్చని అన్నాడిఎంకె పార్టీ వర్గాలు తెలిపాయి.. అయితే అనుకోని విధంగా ఆమెకు గుండెనొప్పిరావటంతో సాధారణ వార్డు నుంచి అత్యవసర విభాగానికి ఆమెను తరలించారు.

అపోలో వద్దకు చేరుకుంటున్న అభిమానులు

తమిళనాడు సిఎం జయలలిత అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రులు, అన్నాడిఎంకె కార్యకర్తలు ఆదివారం రాత్రి హుటాహుటిన అపోలో వైద్యశాలకు చేరుకుంటున్నారు.. ఆమెకు గుండెపోటు రావటంతో హృద్రోగ,శ్వాసకోస నిపుణులు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులిటెన్‌ను విడుదచేశాయి.
=