అంబేద్కర్‌ జయంతి కానుకగా ఉజ్వల యోజన

BSRP
Dharmendra pradhan

అంబేద్కర్‌ జయంతి కానుకగా ఉజ్వల యోజన

కట్టెలపొయ్యి రహిత దేశంగా తీర్చిదిద్దుతాం
మహిళల అభ్యున్నతి కోసం పాటుపడతాం
రాZంలోబిజెపి అధికారంలోకి వస్తే రైతులకు 2లక్షల రుణమాఫీ
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

సూర్యాపేట,: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అం బేద్కర్‌ జయంతి కానుకగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రవేశపె ట్టినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవనరులశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తెలి పారు. శనివారం సూర్యాపేట జిల్లాలోని స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర బీజేపి ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ధర్మేంద్రప్రధాన్‌ ప్రారంభించి అర్హులైన వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పేద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున పేద ప్రజల కోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభించడం నా అదృ ష్టంగా భావిస్తున్నాని తెలిపారు. పేదల సహకారంతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉజ్వల పథకం ద్వారా 3.57కోట్ల మందికి బీజేపి ప్రభు త్వం గ్యాస్‌ అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20లక్షల మంది గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారిగా గుర్తించామన్నారు. వారందరికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని హామి ఇచ్చారు. బీజేపి అధికారంలోకి వచ్చిన 4సంవత్సరాలలో మహి ళలు, యువతి, యువకులకు పెద్దపీఠవేశామన్నారు. 6సిలిండర్ల వరకు ఒక్క రూ పాయి కట్టకుండా గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1000 గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. ఏప్రిల్‌ 20వ తేదీ వరకు 10 వేల గ్రామాల్లో ఉజ్వల యోజన పథకం కింద మేళ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ప్రతి పేద వాడికి గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వడమే లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం ఇక్కడి ప్రజల అదృష్టమని మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కిరోసిన్‌, కట్టెలపొయ్యి వాడనపుడే బంగారు తెలంగాణ అవుతుందని పేర్కొ న్నారు. విద్య, వైద్యం బలపడాలని సూచించారు. ఆడపిల్ల అన్నిట్లో రాణించి నపుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉద్యోగం, ఉపాధి ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన పేద ప్రజలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్‌ అన్నారు. మోదీ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. కట్టెల పొయ్యివల్ల మహిళలు అనారోగ్యానికి గురౌతున్నారని గుర్తించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అర్హులైన అన్ని వర్గాలకు అందజేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ని కోరారు.