అందుబాటులో నగదు లభ్యత

Cash
Cash

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న విషయం విదితమే. కానీ గడిచిన రోజు తర్వాత ఏటిఎంల వద్ద నగదు లభ్యత క్రమంగా మెరుగవుతుందని ఎస్బీఐ పేర్కొంది. గత 24గంటల్లో నగదు సరఫరా క్రమంఆ పుంజుకుందని తెలసింది. ఏటిఎంల వద్ద నగదు కొరత కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పిఎన్‌బీ, కెనరా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు పేర్కొన్నాయి. గత 24గంటల్లో ఎస్బీఐ ఏటిఎంల వద్ద నగదు లభ్యత మెరుగైందని, నగదు కొరత నెలకొన్న ప్రాంతాల్లోనూ నగదు సరఫరా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని,త్వరలోనే నగదు అందుబాటులో సాధారణస్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ సీఈవో నీరజ్‌ వ్యాస్‌ చెప్పారు. తమ ఏటిఎంలలో నగదు లభ్యత పెంచెందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమ ఏటిఎం వద్ద నగదు లభ్యత మెరుగ్గా ఉందని,ఎలాంటి సమస్యలు లేవని ప్రైవేట్‌రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు నగదు విత్‌డ్రా కోసం తమ ఏటిఎంలకు రావడంతోనే కొన్ని చోట్ల ఏటిఎంల్లో నగదు కొరత ఏర్పడిందని పేర్కొంది. ఇక కరెన్సీ కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, తగినంత నగదు సరఫరా ఉందని ఆర్బీఐ స్పష్టం చేయగా రూ.500నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచామని కేంద్రం తెలిపింది.