అందాల ఆరబోత!

Anushka1
Anushka

అందాల ఆరబోత!

 

తెలుగు తెరపై అందానికి ప్రతీకగా అనుష్కను గురించి చెప్పుకుంటారు. అలాంటి అనుష్క గ్లామర్‌ పరంగా అభిమానులను అలరించక చాలా కాలమే అయింది. బాహుబలి.. రుద్రమదేవి.. సైజ్‌ జీరో ఇలా ఆమె గ్లామర్‌ తో సంబంధం లేని పాత్రలను చేస్తూ వచ్చింది. అందువలన ఆమె గ్లామర్‌ ను ఆశించే అభిమానులకు నిరాశే ఎదురైంది. అలాంటి అభిమానుల కోసమే ఆమె సింగం 3 సినిమాలో గ్లామర్‌ ను ఒలకబోసిందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల కొన్ని పోస్టర్లను విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌ లో ఒక రేంజ్‌ లో అందాలను ఆరబోస్తూ అనుష్క కనిపిస్తోంది. దాంతో ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి రేకెత్తుతోంది. మొత్తానికి ఈ సినిమాలో అనుష్క అందాల విందు చేయనుందన్న మాట.