అందాన్ని పాడుచేసే తెల్లమచ్చలు

Pimples Care
Pimples Care

అందాన్ని పాడుచేసే తెల్లమచ్చలు

బొల్లి వ్యాధి వంశపారం పర్యంగా రాదు, కాకపోతే, జన్యువ్ఞ ల్లో జరిగే మార్పులు కొంతవరకూ దీనికి కారణ మయ్యే అవకాశం ఉంది. దీనిని జెనిటికల్‌ ప్రీడిస్పోజిషన్‌ అంటారు. ఇలా అయిదుశాతం కేసుల్లో మాత్రమే జరుగుతుంది. జాగ్రత్తలు, సూచనలు : చి ఈ వ్యాధి గురించి, దీని సాధ్యాసాధ్యతల గురించి లేనిపోనివి ఊహించుకొని హడలిపోకూడదు. డిప్రెషన్‌కు లోనుకాకూడదు. మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. పాజిటివ్‌గా ఉండాలి. చి బొల్లి వ్యాధి నుంచి త్వరగా బయటపడాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవటం ముఖ్యం. కాకపోతే, విటమిన్‌-సి ఎక్కువగా ఉన్న పదార్థాలను అంటే పుల్లగా ఉండే పదార్థాలను (నిమ్మ,నారింజ, గోంగూర, టమాట, చింతపండు, వెనిగార్‌ మొదలైనవి) తిన టం తగ్గించుకోవాలి. చి విటమిన్‌-సికి సన్‌స్క్రీనింగ్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది.

అంటే సూర్యకిరణాల ను అడ్డుకునే తత్వమన్నమాట. సూర్యకిరణాలు అడ్డగింపబడినప్పుడు చర్మపు రంగుకు కారణమైన మెలనోసైట్స్‌ ప్రేరేపితం కావ్ఞ. ఆహారంలో లివర్‌ ఎక్స్‌ ట్రాక్ట్స్‌, వెన్న, మజ్జిగ, బాదం, అత్తిపండ్లు, మొలకెత్తిన గింజలు, వెలగపం డ్లు వంటివి ఎక్కువఉండేలా చూసుకోవాలి. ఎంతోఅవసరమైతేతప్ప యాంటీ బయాటిక్స్‌ను వాడకూడదు. శరీరంపైన దెబ్బలు, గాయాలుకాకుండా చూసు కోవాలి. గాయమైన చోట తెల్లమచ్చ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆయుర్వేద చికిత్సాకాలం చి మూడు నెలల నుంచి ఆరునెలల వరకు ట్రీట్‌మెంట్‌ తీసుకోవలసి ఉంటుంది. పిల్లల్లో రిజల్ట్‌ త్వరగా వస్తుంది.

నలభై సంవత్సరాలు దాటిన వారిలోను, వ్యాధి సంవత్సరానికి మించి ఉన్నవారిలోను, మచ్చలు అరికా ళ్ళు, అరిచేతులు, పెదవ్ఞలు, జననాంగం మొదలైన ప్రదేశాల్లో ఉన్నవారి లోను, పొడలన్నీ కలిసిపోయి ఒకే మచ్చలా తయారైనవారిలోను, మచ్చపైన ఉండే వెంట్రుకలు తెల్లగా మారి నప్పుడూ రిజల్ట్‌ కనిపించటానికి చాలాకాలం పడుతుంది. చి గృహచికిత్సలు ఉత్తరేణి మొక్కను సమూలంగా కాల్చి, బూడిద చేయా లి. దీనికి మణిశిల పొడిని, చిత్రమూలవేరుపై బెరడు పొడిని సమానభాగా లుగా కలిపి, మజ్జిగ చేర్చి పైకి పూయాలి. చి మాల్కంగనీ తైలాన్ని మచ్చలపైన పూయాలి. చి బావంచాలు ఈ వ్యాధిలో తిరుగులేని ఔషధి. బావంచాల గింజపొడిని (పావ్ఞచెంచా) చెంచాడు తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దీని నే మచ్చలపైన కూడా రాసి మూడు నిమిషాల పాటు మచ్చలను ఎండకు చూపించాలి.