అందమైన బాడీ ఉన్నందుకు గర్వపడండి..

Pooja Hegdae-1
Pooja Hegdae

తిట్టేవాళ్లు తిడుతూనే ఉంటారు… కాన్ఫిడెన్స్ ఈజ్ సెక్సీ అంటూ చెప్పిన పూజా హెగ్దే…‘అందమైన శరీరమున్న అమ్మాయిలంతా స్వేచ్ఛగా మీ అందాన్ని చూపించండి. ఎవరో అలా చేయకూడదని చెప్పడం వల్ల భయపడి మానేసిన అమ్మాయిలు వాళ్లపై గట్టిగా అరవండి. బికినీలు వేయండి. బికినీలు వేసేంత అందమైన బాడీ ఉన్నందుకు గర్వపడండి…’ అంటూ పోస్టు చేసిన పూజా… మిమ్మల్ని మీరు ప్రేమించడమే అందరినీ మార్చడానికి మంచి దారి! అంటూ చెప్పింది. ఏవో ఏదో అన్నంత మాత్రాన తాను తగ్గనంటూ బికినీ వేసుకున్న మరో ఫోటోను పోస్ట్ చేసింది పూజా హెగ్దే.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న పూజా… ఇక్కడికి రాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్.టీ.ఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించనుంది. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమాలో ఈ పిల్లే హీరోయిన్. త్వరలో ప్రభాస్ సరసన కూడా సినిమా చేయనున్నట్టు చెప్పిందీ జిగేలు రాణి.